Monday, April 21, 2025
spot_img

వీధి కుక్కలు భౌబోయ్

Must Read
  • భయపెడుతున్న గ్రామ సింహాలు:
  • చికెన్ వ్యర్ధాలే ఆహారం
  • వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
  • పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
  • కానరాని సంతాన నిరోధక చర్యలు
  • రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
  • నివారించడంలో అధికారులు విఫలం

పాలకవీడు మండలంలోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. రోడ్ల మీదకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి. మండల పరిధిలోని జాన్ పహాడ్, గుండ్లపహాడ్, కోమటికుంట,దర్గా, పాలకవీడు, గుడుగుంట్ల పాలెం గ్రామపంచాయతీల్లో వీటి బెడద అధికంగా ఉంది. రోడ్లపై గుంపులు గుంపులుగా సంచరిస్తున్న గ్రామ సింహాల కారణంగా తమ పిల్లల్ని స్కూళ్లకు పంపించే సమయంలో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.

చికెన్ వ్యర్ధాలే కారణం: ఉదయాన్నే దైనందిన పనుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు వాహన రాకపోకలు సాధించే వారిపై కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. రోడ్లపై నిద్రిస్తూ వాహన శబ్దం రాగానే లేచి, వెంటపడి తరుముతున్నాయి. భయంతో వేగాన్ని పెంచి ప్రమాదాల బారిన పడుతున్నామని వాహన చోదకులు వాపోతున్నారు. జాన్ పహాడ్,గుండ్ల పహాడ్, పాలకవీడు, జాన్ పహాడ్ దర్గా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మాంసం దుకాణాల వద్ద వీధి కుక్కలు అధికంగా తిరుగుతున్నాయి. దుకాణదారులు పారబోసిన వ్యర్ధాలను తింటూ తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో వీధుల్లో అరుపులతో విచ్చలవిడిగా సంచరిస్తూ కంటిమీద కురుపు లేకుండా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.

పెరుగుతున్న కుక్క కాటు బాధితులు: వీధి కుక్కల దాడులతో ప్రతిరోజు నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు సగటున ముగ్గురు చొప్పున వచ్చి వైద్యం పొందుతున్నారు. పాలకవీడు మండలంలో వీధి కుక్కల నియంత్రణకు పంచాయతీ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వాటి సంతతి రోజు రోజుకీ పెరుగుతుంది. వీధి కుక్కల నియంత్రణ పేరిట మొక్కుబడి కార్యాచరణతో అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. నేరేడుచెర్ల పీ హెచ్ సీ లో రేబిస్ వ్యాక్సిన్ లు అందుబాటులో ఉండడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకుంటున్నారు.

•పీ హెచ్ సీ పరిధిలో గత మూడు నెలల వ్యవధిలో కుక్క కాటు బాధితులు:

జనవరి: 93

ఫిబ్రవరి: 115

మార్చి: 104

ఏప్రిల్ 19 వరకు 86

మొత్తం: 398

వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి: కుక్క కాటుకు పీ హెచ్ సీ లో వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. వీటి బారిన పడిన రోగులు ఆసుపత్రిని సంప్రదించి ఉచితంగా వైద్యం పొందవచ్చు. గాయపడిన వ్యక్తులను నేరుగా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి వైద్యులు సూచించిన మందులు వాడాలి. చిన్నపిల్లలను కుక్కలకు దూరంగా ఉంచాలి.

  • పి.నాగిని వైద్యాధికారి నేరేడుచర్ల

నియంత్రణకు చర్యలు చేపడుతాం: ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. కుక్కలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వాటిని పట్టి ఇతర చోట వదులుతాం. సంతతి నివారణకు పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి వాక్సినేషన్ వేయించి శస్త్ర చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటాం.

  • వీరయ్య ఎంపిఓ పాలకవీడు.

అధికారులు స్పందించాలి: గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూగజీవాలపై దాడి చేసి హత మారుస్తున్నాయి. మనుషులను కాటేస్తున్నాయి మండలాధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలి.

  • కిష్టారావు జాన్ పహాడ్.
Latest News

భూ భారతి తో రైతుల భూములకు భద్రత

భూ సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు జూన్ 2వ తేదీ నుండి సమస్యల పరిష్కారానికి కృషి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దీర్ఘకాలిక భూ సమస్యల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS