ఏప్రిల్ 27న జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కాటం శివ ఆధ్వర్యంలో “చలో వరంగల్” పోస్టర్ ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, తెలంగాణ తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల నుండి లక్షలాదిగా విద్యార్థులు రజతోత్సవ సభకు తరాలి రావాలని కోరారు. సభను విజయవంతం చేసి పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్లు నాగరాజు, మధు, సందీప్, రామకృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.