జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు
సూర్యపేట, జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం లోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సెంటర్ ద్వారా 1680 క్విoటాల ధాన్యం ను మిల్లులకి ఎగుమతి చేశామని పేర్కొన్నారు. భద్రయ్య అనే రైతుకి చెందిన ధాన్యం పరిశీలించి, రైతులు తాలు లేకుండా తుర్పాలా పోపించి శుభ్రం చేపించి,తేమ శాతం 17 ఉండేలా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకొని రావాలని అదనపు కలెక్టర్ అన్నారు.కొనుగోలు కేంద్రాలకి ముందుగా వచ్చిన ధాన్యం ప్రకారం సీరియల్ నెంబర్ లు ఇవాలని తేమ శాతం 17 రాగానే కాంటా వేసి ధాన్యం మిల్లులకి తరలించాలని సూచించారు.తదుపరి నాగారం లోని వాసవి, వసుధ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, సెంటర్ ఇంచార్జి శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు.