Friday, April 25, 2025
spot_img

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

Must Read
  • సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను టెస్ట్‌ చేసిన భారత్‌
  • లక్ష్యాన్ని ఛేదించిన వీడియోడ విడుదల

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. నౌకదళం పూర్తిగా అప్రమత్తతతో ఉంది. తాజాగా గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయ‌ర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీస్కిమ్మింగ్‌ టార్గెట్‌లుగా పేర్కొంటారు. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, వివిధ రకాల మిలటరీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్‌ చేస్తూ ధ్వంసం చేసింది. ఇక టార్గెట్‌పైకి మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ ను వినియోగించారు. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తాము ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామంటూ పాక్‌ మిలటరీ నోటమ్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలు 24, 25 తేదీల్లో చేపడతామని వెల్లడించింది. అదే సమయంలో ఐఎన్‌ఎస్‌ సూరత్‌ సరికొత్త మైలురాయిని చేరే సీస్కిమ్మింగ్‌ పరీక్షను నిర్వహించడం గమనార్హం.

వాస్తవానికి సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ క్షిపణులపై ఎంఆర్‌-ఎస్‌ఏఎంలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ అరేబియా సముద్రంలోకి వచ్చింది. ఉపగ్రహ ఛాయా చిత్రాలు దీనిని ధ్రువీకరించాయి. ప్రస్తుతం కర్ణాటకలో కార్వార్‌ పోర్టు సవిూపంలో ఇది గస్తీ కాస్తోంది. కాకపోతే కొన్ని వారాల ముందే అనుకొన్న ప్రణాళిక ప్రకారమే దీని మోహరింపు జరిగిందని చెబుతున్నా.. పహల్గాం దాడి వేళ ఈ సమాచారం బయటకు రావడం గమనార్హం. ఈ విజయవంతమైన పరీక్ష భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో మరో ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పరీక్ష జరిగింది. పాక్‌ సైన్యం ఈ మారణ హోమానికి కుట్ర పన్నినట్లు- నివేదికలు అందుతున్న నేపథ్యంలో తాజా టెస్ట్‌ ఫైర్‌ పాకిస్తాన్‌కు ఒక వార్నింగ్‌ గా ట్రీట్‌ చేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ లేదా రేపు పాకిస్తాన్‌ తన కరాచీ తీరప్రాంతం నుండి, దాని ప్రత్యేక ఆర్థిక మండలంలో, ఉపరితలం నుండి ఉపరితలం వరకు క్షిపణి పరీక్షను నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో మన టెస్ట్‌ ఫైర్‌ జరగడం విశేషం. పరీక్షా ప్రయోగం యొక్క వీడియోను పంచుకుంటూ, భారత నావికాదళం.. తాజా స్వదేశీ గైడెడ్‌ క్షిపణి విధ్వంసక నౌక ఒకా సూరత్‌ సముద్ర స్కిమ్మింగ్‌ లక్ష్‌యాన్ని విజయవంతంగా నిర్వహించిందని, ఇది మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరో మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది. ఇప్పటికే దౌత్య విభాగంలో పాక్‌తో సంబంధాలను భారత్‌ మరింత తగ్గించుకొంది.

Latest News

గ్రామాలు స్వయం ప్రతిపత్తి సాధించాలి

గాంధీ మహాత్ముడి ఆశయం కూడా అదే పంచాయితీ నిధులు వాటికే ఖర్చు చేస్తున్నాం జాతీయ పంచాయితీరాజ్‌ దినోత్సవంలో డిప్యూటి సిఎం పవన్‌ గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS