Saturday, September 6, 2025
spot_img

డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

Must Read

కుకట్‌పల్లిలో ఏపీకి చెందిన ఆరుగురి అరెస్ట్

ఇందులో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్

హైదరాబాద్‌‌లోని కుకట్‌పల్లి వివేకానందనగర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌కు మత్తు పదార్థాలను తరలిస్తున్న ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్‌, ఎపిడ్రిన్‌‌, 5 మొబైల్స్‌, రూ.50 వేల నగదును సీజ్‌ చేశారు. నిందితుల్లో ఒకరిని తిరుపతిలోని ఏఆర్‌ కానిస్టేబుల్‌ గుణశేఖర్‌గా గుర్తించారు. తిరుపతిలో మొదలైన ఈ డ్రగ్స్‌ ముఠా వ్యవహారం బాపట్ల, గుంటూరు నుంచి హైదరాబాద్‌ మీదుగా జరుగుతున్నట్లు మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితులందరూ ఏపీకి చెందినవారేనని చెప్పారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు వెల్లడించారు. మిగతా నిందితులను.. తిరుపతి రూరల్ ఏరియాకి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి(38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29). ఈ కేసులో పోలీసు పట్టుబడటం సంచలనం రేపుతోంది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This