- ప్రస్థుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి నీ కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్న నేపథ్యంలో రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది…
- బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించినపుడు మరో బీసీ నేత అయిన ఈటల ను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా జోరుగా సాగింది. అయితే అధిష్టానం మాత్రం కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నే అధ్యక్షుడిగా నియమించింది…
- తాజాగా మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను తీసుకున్న నేపథ్యంలో ఇక ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం మరోసారి జోరుగా సాగుతోంది…
- ఈటల కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయమని బీజేపీ కి చెందిన సీనియర్ నేత అంతర్గత చర్చలో బలంగా చెబుతున్నారు!
- అయితే పార్టీలోని మరో వర్గం మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై పదునైన విమర్శలతో విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ డీకే అరుణ కు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించవచ్చని చెబుతోంది…
- ఈటల కంటే అరుణనే బలంగా పార్టీని బలోపేతం చేయగలరని చెబుతున్నారు..
- ప్రస్తుతం మూడవ సారి ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలై ఉన్న అధిష్టానం మరో రెండు మూడు రోజులు గడిస్తే కానీ పార్టీ పై దృష్టి పెట్టే అవకాశాలు లేవని రాష్ట్రానికి చెందిన జాతీయ నేతలు చెబుతున్నారు.
Must Read