రూల్ ఆఫ్రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ సమావేశం
ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.
ఈ సంధర్బంగా ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరు, పలు కేసుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపైనా సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై మరొకసారి సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది.