Wednesday, October 22, 2025
spot_img

T-Hubలో మరం నీరజకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Must Read

హైదరాబాద్‌కు చెందిన ఆరోగ్య సంరక్షణ రంగ నిపుణురాలు మరం నీరజ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మరం నీరజకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా మరం నీరజ మాట్లాడుతూ, “ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతోంది. ఈ బూట్ క్యాంప్‌లో నేర్చుకున్న AI టూల్స్, నా వృత్తిపరమైన సేవలను మరింత మెరుగుపరచడానికి, రోగులకు మెరుగైన సంరక్షణ అందించడానికి దోహదపడతాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా మన రంగంలో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This