తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్, కేంద్ర మంత్రిగా ఉన్న స్థాయికి తగ్గట్టు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ లాభాల కోసం అసత్య ఆరోపణలు చేయడం తగదని విమర్శించారు. ఈ వివాదంపై కేటీఆర్ బండి సంజయ్‌ను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని హెచ్చరించారు.