తెలంగాణ రాష్ట్రంలోని భాష పండితుల పదోన్నతుల వ్వవహారం మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనుకకు అన్న చందంగా తయారైంది.తెలంగాణ రాష్ట్రం లోని 8648 భాష పండితులకు,1352 దాదాపు 10 వేల మందికి పైగా పదోన్నతులు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.తెలంగాణ రాష్ట్రం లోని భాషలు ( తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, సంస్కృతం మిగతా దేశీయ భాషలు) బోధించే ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలలో పనిచేస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటూ శ్రమదోపిడికి, వెట్టిచాకిరికి గురయ్యారు.గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని భాష పండితులకు పదోన్నతులు ఇవ్వడానికి జీ.వో 2,3 జీ.వో 9,10, జీ.వో 110 అంటూ మూడు, నాలుగు సార్లు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రాథమిక పాఠశాలలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులు తెలంగాణ రాష్ట్రంలోని భాష పండితుల పదోన్నతులలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కు వెళ్లి స్టే తీసుకొని రావడం వాయిదా వేయించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం డివిజనల్ బెంచ్ పండితుల పోస్టులు పండితులకే పి.ఈ.టి పోస్టులు పి.ఈ.ట లకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చింది.ఎస్జీటి ఉపాధ్యాయులు పండితుల పదోన్నతుల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు అవ ఇవ్వాలని మనదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కు వేసవి సెలవులు ఉండడంతో విక్లీ కోర్టు లో ” స్టే “కోసం రిట్ పిటిషన్ దాఖలు చేశారు.14.06.2024 నాడు సుప్రీంకోర్టు లో పిటిషన్ డిస్మిస్ చేశారు.పండితుల పోస్టులను పండితులకే ఇవ్వాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు అంగీకరించినట్లు అయ్యింది.తెలంగాణ రాష్ట్రం లోని దాదాపు 10 వేల మందికి పైగా భాష పండితులు,పి.ఈ.టి ల ముఖాలలో వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ముఖాలలో సంతోషానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.18.06.2024 నాడు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత పాఠశాల హైకోర్టు లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు ” టెట్ “అవసరమని ఒక సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేస్తే ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ” టెట్” అవసరం లేదని మరో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసింది.ఏ జడ్జి ఉత్తర్వులను అమలు చేయాలో తెలియక విద్యా శాఖాధికారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఉపాధ్యాయుల పదోన్నతులకు ” టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ ( టెట్) అవసరమా ! లేదా ? అనే అంశంపై 20.06.2024 నాడు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు లో కేసు ఉంది. జాతీయ విద్యా సంస్థ ( ఎన్ సీ టి ఈ) ప్రకారం స్థాయి ( లెవెల్) మారనప్పుడు టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్ ) అవసరం లేదు.ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందినా టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ ( టెట్) అవసరం లేదు.ఉన్నత పాఠశాలలలో బోధించే ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడంతో వారు బోధించే పాఠాలలో తేడా రాదు.స్థాయి ( లెవెల్) మారదు.భాష పండితులకు,పి.ఈ.టి లకు బోధించే తరగతులు గాని వేతనం లో తేడా ఉండదు.కేవలం హోదా మాత్రమే మారుతుంది.పండితుల,పి.ఈ.టి పదోన్నతుల విషయంలో టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనలు వర్తించవు.తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెళ్లి తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం గారిని, కమీషనర్ మరియు సంచాలకులు ( డైరెక్టర్ ) గారిని కలిసినప్పుడు బదిలీలపై, పదోన్నతుల పై ఎలాంటి స్టే లేకపోవడం వల్ల యధావిధిగా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు జరుగుతాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రమును విద్యా శాఖ జోన్ 1, జోన్ 2 కింది విభజించింది.జోన్ 1 మరియు హైదరాబాద్ లో ని ఉపాధ్యాయుల సర్వీస్ బుక్ వెరిఫికేషన్, పదోన్నతుల కోసం కొత్త పాఠశాలల ఎంపికకు వెబ్ లో నూతన పాఠశాలల ఎంపిక తర్వాత ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి వెబ్ లో ఎడిట్ ఆప్షన్ అన్ని పూర్తి అయ్యాయి.కేవలం పదోన్నతుల ఆర్డర్ తీసుకొని కొత్త పాఠశాలలకు బదిలీ మీద వెళ్ళడమే మిగిలింది.ఉపాధ్యాయుల పదోన్నతుల ఉత్తర్వులు అదిగో ఇదిగో అంటూ గంట గంటకు ఉత్కంఠను పెంచుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు కాని, తెలంగాణ విద్యా శాఖ కమిషనర్, సంచాలకులు ( డైరెక్టర్) గాని ఇతర విద్యా సంబంధిత అధికారులు భాష పండితుల,పి.ఈ.టి లో పదోన్నతుల విషయంలో జోక్యం చేసుకొని వీలైనంత త్వరగా పండితుల,పి.ఈ.టి లో పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేస్తారని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.,
రాష్ట్ర కార్యదర్శి,
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్. యు. పి. పి) తెలంగాణ.9290826988