Friday, September 20, 2024
spot_img

జ్యుయెలరీ దుకాణంలో ఐటీ సోదాలు

Must Read
  • రూ.26 కోట్ల, ఆస్తులు సీజ్
  • రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని పత్రాలు స్వాధీనం
  • మొత్తం రూ.116 కోట్ల విలువైన ఆస్తులు
  • ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలింపు

మహారాష్ట్రలోని నాసిక్‌లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని సమాచారంతో ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సంపదకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాసిక్‌లోని సురనా జ్యుయెలరీలో ఈ సోదాలు జరిగాయి. సమాచారం ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ ఈ ఆపరేషన్ కోసం ఐటీ శాఖ పలు బృందాలుగా దాడులు నిర్వహించింది. ఇందులో నగల వ్యాపారి కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు జరిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, పన్ను వ్యత్యాసాల గురించి శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అసలు ఏం జరిగిందంటే… ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐటీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌ మెంట్ డైరెక్టర్ జనరల్ సతీష్ శర్మ నేతృత్వంలో అధికారులు సురానా జ్యువెల్లర్స్, కార్యాలయంపైన దాడులు జరిపారు. నాసిక్, నాగ్‌ పుర్, జల్గావ్ బృందానికి చెందిన 50-55 మంది ఆ ఆపరేషన్ ​లో పాల్గొన్నారు. అదే సమయంలో రాకా కాలనీలో ఉన్న సురానా జ్యువెల్లర్స్ యజమాని బంగ్లాలో కూడా తనిఖీలు చేపట్టారు. అలాగే ప్రైవేట్ లాకర్లు, ఆయనకు పలు ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారు. మన్మాడ్, నంద్​గావ్‌లో ఉన్న సురానా జ్యువెల్లర్ యజమాని కుటుంబసభ్యుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. అయితే ఆదాయపు పన్నుశాఖ అధికారులకు తొలుత కార్యాలయాలు, ప్రైవేట్ లాకర్లలో కొద్దిపాటి నగదు మాత్రమే దొరికింది. అదే సమయంలో సురానా జ్యువెల్లర్స్ యజమాని బంధువు విలాసవంతమైన బంగ్లాను తనిఖీ చేయగా అక్కడ లాకర్లలో కూడా డబ్బు కనిపించలేదు. ఈ క్రమంలో అధికారులకు అనుమానం వచ్చి బంగ్లాలో ఉన్న ఫర్నీచర్ ను బద్దలు కొట్టగా నగదు గుట్టలు గుట్టలుగా బయటపడింది. వెంటనే ఆ నగదును లెక్కించేందుకు సీబీఎస్ సమీపంలోని స్టేట్ బ్యాంకుకు వెళ్లగా శనివారం సెలవు కావడం వల్ల బ్యాంకు మూసి ఉంది. వెంటనే స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జ్యువెల్లర్స్ యజమాని బంధువు బంగ్లాలో జప్తు చేసిన నగదును దాదాపు 14గంటలపాటు అధికారులు శ్రమించి లెక్కించారు. అంతకు ముందు జప్తు చేసిన నగదును ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో పెట్టి తరలించినట్లు తెలుస్తోంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This