- ఏడీ శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది..
- ఏడీ యా మజాకా అంటున్న స్థానికులు..
- మేడ్చల్,రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు.
- ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ, నిలువు దోపిడి చేస్తున్న అక్రమార్కులు..
- ప్రైమ్ ల్యాండ్, ప్రైవేటు ల్యాండ్ లంటూ శఠగోపం పెట్టేసే
ఘనాపాఠీలు. - అక్రమ సర్వేల లావాదేవిల్లో డి.ఐ గంగాధర్‌ను పావుగా
వాడుకున్న అవినీతి అధికారి - డి.ఐ.గంగాధర్, సీనియర్ అసిస్టెంట్ రవి కుమార్‌లతో భారీ వ్యవహారాలు నడిపినట్లు ఆరోపణలు.
- డీ.ఐ గంగాధర్, ఏడీ శ్రీనివాసులు చేసిన సర్వేలపై విచారణ జరిపితే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్ట బయలు అవుతాయి.
- ఏడి శ్రీనివాసులు అక్రమాస్తులపై విచారణ జరిపితే హెచ్.ఎం.డి.ఏ బాలకృష్ణ అక్రమాస్తుల కంటే ఎక్కువగా బయటపడాతాయట.
- ఏడి శ్రీనివాసులును సస్పెండ్ చేసి విచారణ జరపాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్..!
ఏడీ శ్రీనివాసులు ఎక్కడ అని అవినీతి వేడుకుతోందట. ఎందుకంటే తనకంటే ఘనుడైన ఆ వ్యక్తిని చూసి, ఒకసారి అతగాడి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవాలని తహ తహలాడుతోందట.. అంతటి ఘనత సాధించారు ఈ అధికారి.. ఈయన చేసే ట్రిక్కులు అన్నీ ఇన్నీ కావు..ముడుపులు అందితేచాలు ప్రభుత్వ భూమిని ప్రయివేట్ భూమిగా సర్వ్ రిపోర్ట్ ఇస్తాడు. ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను సులువుగా మోసం చేస్తాడు. ఈయన కూడబెట్టిన అక్రమాస్తులు లెక్కలేకుండా వున్నాయనే విమర్శలు చాలానే ఉన్నాయి. ఇతగాడిని సస్పెండ్ చేసి, విచారణ జరపాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎవరీ ఏడీ శ్రీనివాసులు..? ఈయన చేసిన ఘనకార్యాలు ఏమిటి..? అన్నదానిపై ఒక లుక్కేద్దాం..
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో సర్వే శాఖలో అసిస్టెంట్ డైరక్టర్ గా విధులు వెలుగ బెడుతున్న ఏడి శ్రీనివాసులు పేరు చెబితే చాలు ఇంతటి అవినీతి అధికారి మరొకరు ఉండరు అని ఈ రెండు జిల్లాల్లో విమర్శలు కోడై కూస్తున్నాయి.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో డిప్యూటి ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వర్తించి ఇటీవలే శామీర్ పేట అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదవశాత్తు మరణించిన డి.ఐ గంగాధర్ ను పావుగా చేసుకుని వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు పరం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డి. ఐ గంగాధర్ (ఇటీవలే ఓ.ఆర్.ఆర్ పై యాక్సిడెంట్ లో మరణించిన అధికారి)
రంగారెడ్డి జిల్లా ఏడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు మేడ్చల్ జిల్లా ఇన్స్ పెక్టర్‌గా అదనపు బాధ్యతలు తీసుకొని అవినీతి అక్రమాలే ద్యేయంగా విధులు వెలుగబెడుతున్న వీరికి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ రవి కుమార్ సైతం సూత్ర పాత్ర దారుడేననే మాటలు వినిపిస్తున్నాయి.. కార్యాలయంలో డాక్యుమెంట్లు మార్పులు చేర్పులు చేస్తూ,అక్రమ సర్వే లు చేసిన రిపోర్టులు బహిర్గతం కాకుండా రవి కుమార్ పాత్ర కీలకమనీ వినిపిస్తుంది.. హైదరాబాద్ జిల్లాకు బదిలీ అయిన అక్కడకి వెళ్లకుండా మేడ్చల్ లోనే మకాం వేసి ఏడి శ్రీనివాసులు కు చేదోడు వాదోడుగా ఉంటున్నాడనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది.. కాసుల కోసం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా వీరి అవినీతి అక్రమ వ్యవహారాలు సాగిస్తున్నారనే బహిరంగ చర్చలు వినిపిస్తున్నాయి.
హైదారాబాద్ జిల్లాలోనీ సీనియర్ అసిస్టెంట్ రవి కుమార్ బదిలీ అయినా నేటికీ విధులు మాత్రం మేడ్చల్ జిల్లాలోనే
ఉప్పల్, తిరుమలగిరి, కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, ఎల్లమ్మ బండ, మళ్ళంపేట, చెంశిగూడ, ముసాపేట ఇలా చెప్పుకుంటూ పోతే వీరి దందాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారిని మించే ఉన్నాయనే వాదనలు సైతం ఉన్నాయి.. ఏడి శ్రీనివాసులు డి.ఐ గంగాదర్ లు మమేకమై ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేసి వందల కోట్లు కొల్లగొట్టినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ప్రైమ్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అనే పదాలు సర్వే పేర్లతో ఇచ్చే నివేదికల్లో వీరికి ఆదాయ వనరులుగా పలువురు సామాజిక వేత్తలు చర్చించుకుంటున్నారు. ఏడి శ్రీనివాసులు అక్రమ సర్వే ల పేరుతో చేసిన వ్యవహారాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తెనుంది ఆదాబ్ హైదారాబాద్ మా అక్షరం అవినీతి పై అస్త్రం.