- ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పై రోజురోజుకు అంతకు అంత పెరుగుతున్న వ్యతిరేకత
- ఇప్పటికైనా తన పంతం మార్చుకోవాలని తన సన్నిహితులు చెప్పిన వినని దుస్థితి
- ప్రజలకు హాని కలిగించే ఫ్యాక్టరీ ప్రారంభించడం ఇది మీకు తగునా ఎమ్మెల్యే
- ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సంవత్సరం కాకముందే ప్రజల్లో కొంత వ్యతిరేక పవనాలు వేస్తున్న వాటిని వీలైనంతవరకు సరిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొంతమంది ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం వాటికి విరుద్ధంగా గ్రామాల్లో పట్టణాల్లో వీలైనంతవరకు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారనే చెప్పాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరిగిన నష్టం గుర్తుంచుకొని మళ్లీ ప్రభుత్వం వారి చేతకి అందితే ప్రజలు అంధకారంలోకి వెళ్తారని ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు.ముఖ్యంగా ముఖ్య కార్యకర్తలను కూడా పట్టించుకునే స్థితిలో స్థానిక ఎమ్మెల్యేలు లేకపోవడం గమనహర్వం.చింతపల్లి మండలం కుర్మేడు గ్రామం పరిధిలో ప్రజలు నివసించాలంటే దుర్భరంగా మారిందనే చెప్పాలి.ఒకపక్క కోళ్ల ఫ్యాక్టరీలతో మరోపక్క అల్యూమినియం ఫ్యాక్టరీతో గ్రామాన్ని కాలుష్యం చుట్టేయడంతో చేసేది ఏం లేక దీనస్థితిలో ఉండిపోయిన గ్రామ ప్రజలు.
హైదరాబాద్ మహానగరానికి అతి దగ్గరలో ఉన్న చింతపల్లి మండలం ముఖ్యంగా కురుమేడు అనే గ్రామం మరి కాస్త దగ్గర అవుతుందనే చెప్పాలి.ఇది ఆసరా చేసుకున్న కొంతమంది కేటుగాళ్లు గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసే పనిలో నిమగ్నమయ్యారు అని చెప్పాలి.గత కొన్ని ఏండ్లుగా ఎవరో చేసిన పాపానికి ఎవరో బాధ్యులు అయినట్టు అధికారుల ధన దాహానికి వారు ఇచ్చిన పర్మిషన్లకు కోళ్ల ఫ్యాక్టరీల నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక ఉక్కులు మూసుకొని బ్రతుకుతున్న బ్రతుకులకు మరో పిడుగు లాంటి విషయం బయటపడింది. ఉన్నట్టుండి అల్యూమినియం ఫ్యాక్టరీ రావడంతో గ్రామంలో ఉండే పోరగాండ్ల బ్రతుకులు మారుతాయి అనుకుంటే అది కాస్త వ్యతిరేక పవనాలు వచ్చినట్టు దాని నుండి వచ్చే దుర్వాసనకు గ్రామంలో ఉండే పరిస్థితి లేదని అది కొద్ది రోజుల్లోనే వాళ్ళకి అర్థమయింది.
ఎలాగైనా ఫ్యాక్టరీని తొలగించాలని గత కొన్ని రోజులుగా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫ్యాక్టరీని తొలగించలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఉన్నపలంగా తిరిగి జీకేఆర్ ఫ్యాక్టరీ అల్యూమినియం ప్రారంభోత్సవానికి రావడంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బాలు నాయక్ వెళుతున్న వాహనాలను అడ్డగించడం అనంతరం ఏదేమైనా ఫ్యాక్టరీ ప్రారంభించేది లేదు అవసరమైతే మా గ్రామంలోకి రాకుండా పర్లేదు అనే రీతిలో గ్రామ ప్రజలు తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి వందలమంది అడ్డుకోవడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే బాలు నాయక్ విని తిరిగి రావడం జరిగింది.ఎమ్మెల్యే బాలు నాయక్ సర్ది చెప్పాలని ఎంత ప్రయత్నం చేసిన వినకుండా వాదించ సాగారు. ఏదేమైనా ఫ్యాక్టరీని సందర్శించి ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకొని అవసరమైతే ఫ్యాక్టరీని తొలగించే ప్రయత్నం చేస్తానని వివరించిన గ్రామ ప్రజలు వినకపోవడంతో తిరుగు ప్రయాణం సాగించారు.