దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వివిధ ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. తమ జోన్లలో భద్రత ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని డీసీపీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముంబయిలోని రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ఏరియాలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.