ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో 795 ఓట్ల మెజారిటీతో టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా మరో సీనియర్ నిర్మాత ఎస్ఎన్ రెడ్డి (696) ఓట్లు, జనరల్ సెక్రెటరీగా తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రెటరీగా సదాశివ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 631 ఓట్లతో ఎఫ్ఎన్‌సీసీ ట్రెజరర్ పదవిని జె శైలజ సొంతం చేసుకున్నారు.
ఎఫ్ఎన్‌సీసీలో పర్మినెంట్ మెంబర్స్‌గా కే.భవానీ, వేణు, రాజా, సీ.హెచ్ వరప్రసాద్ రావు, మోహన్ వడ్లపట్ల ఎన్నికయ్యారు. వీరంతా ఫిల్మ్ నగర్ సొసైటీ నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఎఫ్ఎన్‌సీసీలో సేవలు అందించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతీ ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.