Monday, September 30, 2024
spot_img

ఎవరు బీసీ..? ఎవరి కోసం బీసీ..?

Must Read
  • గత పదేండ్లలో లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది..?
  • పార్టీల నేతలంతా బీసీ రాగాన్ని ఎందుకు ఆలపిస్తున్నారు..?
  • జై బీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఎం చేశాయి..?
  • బీసీ ఐక్యవేదిక సరే.. ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు..?
  • నేతలను ఆహ్వానిస్తున్నారు సరే..అవసరమైతే ఏ పార్టీకి మద్దత్తిస్తారు..?
  • బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి..?
  • బీసీల హక్కుల సాధనకు ఏ జాతీయ పార్టీ మద్దతు కూడగడుతారు..?
    ˜ మీరు ఎదగడానికి బీసీ కావాలా..బీసీ ఎదుగుదలకు మీరు కావాలా..?
  • లీడర్లు జర డిసైడయ్యి ఉద్యమంలోకి దిగండి మునుపున్న రోజులు లేవు..?

నేడు బీసీ అని చెప్పుకుంటూ ప్రతీ రాజకీయ నాయకుడు బీసీ రాగాన్ని ఆలపిస్తున్నాడు ..సభలు సమావేశాలు పెట్టి బీసీలకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలను ఎకరవుపెడుతున్నాడు , బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరుగుతుందని ఊదరగొట్టే ఉపన్యాసాలను ఇచ్చిపడేస్తున్నాడు , బీసీలో ఒకడిగా ఉంటూనే నాయకుడిగా ఎదుగాలనుకుం టున్నాడు. అతను/ఆమె నమ్ముకున్న పార్టీలో అతను/ఆమె ఆశించిన గౌరవం,పదవి దక్కినప్పుడు బీసీ నినాదాన్ని అటకెక్కించేస్తున్నారు , నిజానికి బీసీ ల హక్కులు, అవకాశాలు కాపాడబడడమంటే బీసీ నినాదం ఎత్తుకున్న నేతకు రాజకీయంగా లబ్దిచేకూరినప్పుడేనా ? ఏది నిజం.. ఎవ్వరు చెబుతున్నది నిజం.?

ఎవరు బీసీ ? ఎవరి కోసం బీసీ ?

స్వాతంత్రం కోసం,జాతి హక్కుల కోసం,బడుగూ .. బలహీన వర్గాల బానిసత్వ విముక్తి కోసం పోరాడిన ఏ నేత ,ఏ ఉద్యమకారుడు తాను పదవి ఆశించి పోరాటం చేయలేదు .. ఆనాడు కొనసాగిన ఉద్యమాలు,ఉద్యమ స్ఫూర్తి తీరుతెన్నులు పూర్తిగా తెల్లని పాలవలే స్వచ్చమైనవిగా ఉండేవి.. కాలం మారింది దానికనుగూణంగా ఉద్యమాల స్ఫూర్తి , స్వరూపం, దిశా, దశ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి… నేడు ఉద్యమ నేతలను స్వార్ధం ఆవహించింది ..కొందరి నాయకుల స్వార్ధపు ఆలోచనలకు అణగారిన కులాల ఆశలు ,బతుకులు, ప్రయోజనాలు పెట్టుబడిగా మారిపోయాయి.. శిథిలమైపోతున్న తమ బతుకులను బాగుచేస్తారని కోటి ఆశలు పెట్టుకున్న జనాల బతుకులు ఇంకా రోజు రోజుకు దిగజారిపోతూనే ఉన్నాయి.. ఎలాంటి రాజకీయ లబ్ది ఆశించకుండా .. అణగారిన కులాల అభ్యున్నతి కోసం నిలబడే నాయకుడికి కోసం .. చితికిలబడ్ద కుటుంబాలు…. చేతులు జోడిరచి ఎదురుచూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు బీసీ జాతికి కావలసింది అంబేద్కర్‌,జ్యోతిరావు పూలే లాంటి నేతలు కావాలి ..కానీ అలనాటి నాయకులు మచ్చుకైనా కనబడటంలేదు.. నాకు రాజకీయాలు వద్దు…. పదవులు వద్దు .. కేవలం బీసీల ప్రగతి కోసం మాత్రమే నా తుదిశ్వాస విడిచేవరకు పోరాడుతాను అనుకునే నాయకుడు ఉన్నాడా .. ..ఉన్నా ఈ ఉద్దండులు ఉద్యమనేతను నెగలనిస్తారా ..కులమనే రంగును పులమకుండా పగ్గాలు అప్పగిస్తారా ?

పార్టీలన్నీ ఎందుకు బీసీ రాగాన్ని ఆలపిస్తున్నాయి ?

దేశంలో అత్యధిక ఓటర్లు బీసీ కులాల వారే అనే విషయం ప్రతి రాజకీయ పార్టీకి , నాయకుడికి తెలుసు. కానీ బీసీలకు రాజ్యా ధికారం ఇవ్వడానికి మాత్రం ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడంలేదు .బీసీ కులగణన విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకమై ప్రజలను మభ్య పెడుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తప్ప బీసీలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడంలేదు .. జనాభా లెక్కలలో ఎస్సీ,ఎస్టీ కులాల వారీగా లెక్కలు తీయడం వల్ల వారికి సరైన రిజర్వేషన్లు దక్కాయి.. దక్కుతున్నాయి. దక్కుతూనే ఉంటాయి..నిజానికి బీసీలకు కులాలవారీగా ఎలాంటి లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్ల వాటా శాతం కోల్పోవాల్సి వస్తుంది.ఇలాంటి నేపథ్యంలో సమాజంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూనే గల్లీకొక లీడరు పుట్టుకొస్తున్నాడు..పుట్టుకొచ్చిన లీడరు నాయకుడిగా,ప్రజాప్రతినిధిగా ఎదుగుతున్నాడు.. కానీ ఎదిగిన నేతతో బీసీ జాతి కేంటి లాభం చేకూరింది అంటే సున్నాగా చెప్పవచ్చు ..బీసీ నని చెప్పుకుంటూ ఎదుగుతున్న నేతలతో బీసీ జాతికి ఎలాంటి ప్రయోజనం చేకూరడంలేదు..

దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి:-

ఎన్నికల సమయంలో మాత్రమే ఈ సారి మేము గెలిస్తే బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని నోటిమాటగా చెపుతున్న ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఆచరణలో మాత్రం చూపడంలేదు.. మన దేశంలో ఉన్న రాజ్యాధికార వ్యవస్థలు, పార్లమెంట్‌ వ్యవస్థలు, అసెంబ్లీ, కమిషన్లతోపాటు, అనేక రాజకీయ పార్టీల కార్య నిర్వాహక శాఖలలో పనిచేస్తున్న వారు ఎంత మంది? అందులో బీసీల శాతం ఎంత? రాజకీయ నాయకులలో అత్యధిక శాతం పదవులు అనుభవించే వారి శాతం ఎంత? అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ జనాభాలో 75 శాతం మంది బీసీ కులాలకు చెందిన వారు ఉంటె.. రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న వారిలో 75 శాతం మంది అగ్రవర్ణాలకు చెందినవారే కావడం నిజంగా బాధాకరం

బీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఎం చేశాయి ?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావోస్తున్నా ఇప్పటికి బీసీ కుల గణన ఇంకా కలగానే ఎందుకు మిగిలిపోయింది. ? ఇంత జరుగుతున్నా ..బీసీ నినాదాన్ని మోసిన..మోస్తున్న సంఘాలు ఇప్పటిదాకా ఎం చేశాయి..ఐక్యవేదిక పేరుతొ మరో కొత్త రధాన్ని ఎక్కి ఊరేగాలనుకుంటున్న బీసీ సంఘాలు, ఇంకా.. ఇంకా ..బీసీ జాతిని ఎం ఉద్ధరిస్తారు… స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపునిచ్చిన బీసీ కులాలకు రాజ్యాధికారం నేటికీ అందని ద్రాక్షలాగానే ఎందుకు మిగిలిపోయింది. దేశ జనాభాలో 75 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం లేకపోవడం నిజంగా శోచనీయం. బీసీల వెనుకబాటుతనానికి స్వార్ధపూరిత నేతల స్వార్థపు ఆలోచనలే కారణమని చెప్పడానికి సంకోచించడంలేదు. ఈ నేరం..పాపం ముమ్మాటికీ సంఘం పెద్దలుగా చెప్పుకుని తిరుగుతున్న పెద్దలదే..?

తెలంగాణాలో బీసీ ల రిజర్వేషన్ల ఖరారు వాటి అమలు :-

రాష్ట్రంలో గుర్తించిన 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రం లో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లనున్ల అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లనున్ల కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. గ్రూపు ‘ఏ’లోని కులాలకు 7 శాతం, గ్రూపు ‘బీ’లోని కులాలకు 10 శాతం, గ్రూపు ‘సీ’లోని కులాలకు 1 శాతం, గ్రూపు ‘డీ’లోని కులాలకు 7 శాతం, గ్రూపు ‘ఈ’లోని కులాలకు 4 శాతం కలుపుకొనిమొత్తం 29 శాతం రిజర్వేషన్లనున్ల ఖరారు చేసింది.

బీసీలు కలిసి ఉన్నారు కానీ ఒకటిగా లేరు. ?

విద్యా , ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ రాజకీయపరంగా బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ ఓటర్లు, ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు,మిగిలిన ప్రజాప్రతినిదులు ఒక్కసారి ఆలోచించాలి. నిజానికి ఈ వైఫల్యాలను అసెంబ్లీలో, పార్లమెంటులో బీసీల హక్కులకై నేతలు గొంతెత్తి ప్రశ్నించాలి, కానీ అలా అడగలేక పోతున్నారు. ఆ వర్గాల నుంచి వచ్చిన నేతలు ఆ వర్గం ప్రజల రాజ్యాధికార కోరికలను గుర్తించాలి. రాజకీయ రిజర్వేషన్ల కోసం ఇంకా అడపాదడపా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ఉద్యమాలు ఒక ఉప్పెనగా మారడం లేదు. కేవలం చిన్న చిన్న ప్రతిఘటనలు, ఉద్యమాలు వారి మనుగడను కాపాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి,

ఎందుకు నాయకులు చట్ట సభల్లో నోరు విప్పరు :-

అన్ని పార్టీల నాయకులు దేశంలో అత్య ధిక జనాభా ఓబీసీలే అంటారు. అలాగే వారికి రాజకీయ రిజర్వేషన్లు చట్ట సభలలో కల్పించాలని ఏసీ గదుల్లో కూర్చుని మాత్రమే మాట్లాడతారు. బయట, చట్టసభలలో మాట్లాడేటప్పు డు వారు నోరు విప్పరు. ఎమ్మెల్యే , ఎంపీ సీట్లు కేటాయించేటప్పుడు వారి జనాభా ప్రకారం వారికి సీట్లు ఇవ్వరు. మైనార్టీ వర్గంలో ఉన్న వారికే మెజారిటీ సీట్లు కేటాయిస్తారు. ఇలా ప్రతి సందర్భంలో బీసీలు రాజకీయ అవమానాలకు గురవుతున్నారు. చట్టసభలలో బీసీలకు దక్కాల్సి న సీట్లు పార్లమెంటులో 545 ఎంపీ సీట్లలో 270 సీట్లు, 250 రాజ్య సభ సీట్లలో 120 సీట్లు కేవలం ఓబీసీలకు మాత్రమే రావాలి. అదే విధంగా తెలం గాణలో 119 ఎమ్మె ల్యే సీట్లలో 59 సీట్లు, జనాభా పరం గా బీసీలకు రావాలి. తెలంగాణలో జిల్లాల ప్రకారం చూసుకుంటే ఉదాహరణకి ఒక జిల్లాలో 14 సీట్లు ఉం టే 7 సీట్లు బీసీలకే రావాలి కానీ అలా ఎక్కడా జరగడం లేదు.

బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి ?

అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్‌ లో కేటాయింపులు చేస్తామని గతేడాది హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్‌ కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్‌ పద్దతిలో అందరికీ ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది. నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. గతేడాది హైదరాబాద్‌ లోని నాగోల్‌ లో జరిగిన బీజేపీ తెలంగాణ ఓబీసీ సమ్మేళనంలో ఆ పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు కేంద్రసహాయమంత్రి ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ సహా బీసీ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బీసీ డిక్లరేషన్‌ ను ప్రవేశపెట్టగా బండి సంజయ్‌ ఆమోదించారు.ఈ బీసీ డిక్లరేషన్‌ కు నేటికీ అతిగతిలేదు ..ఇలాంటి నేపథ్యంలో బీజేపీని ఎలా బీసీ నేతలు విశ్వసిస్తారు..

మీరు ఎదగడానికి బీసీ కావాలా ..బీసీ ఎదుగుదలకు మీరు కావాలా ..?

బీసీ నేతగా ఎదగాలనుకుంటున్న నాయకులు ఒక్కటి గుర్తుంచుకోవాలి..మీరు ఎదగడానికి బీసీ కావాలా ..బీసీ ఎదుగుదలకు మీరు కావాలా ..?అనేది స్పష్టంగా గుర్తెరిగి..లీడర్లు జర డిసైడయ్యి ఉద్యమంలోకి దిగండి మునుపున్న రోజులు ఇప్పుడు లేవు ! బీసీ నేత ఒక బీసీ నేతగానే రాజకీయాలు చేయాలి.ఆతను/ఆమె కులం ఏదైనా కావొచ్చు ..
యాదవ, పద్మశాలి,కురుమ,బెస్త,గౌడ్స్‌,ముదిరాజ్‌ ఇలా ఏ కులమైన కావొచ్చు బీసీ ఉద్యమనేతగా బీసీ గానే చెప్పుకోవాలి ..పిలిపించుకోవాలి ..ఒకవేళ బీసీ లకే రాజ్యాధికారం దొరికినా … బీసీలందరికి న్యాయం జరిగేలా నిస్వార్ధంగా ఆ నాయకుడు పనిచేయగలగాలి..తుచ్చమైన రాజకీయాలు చేయొద్దు .పదవులకు..పరిస్థితులకు..హోదాకు లొంగకుండా బీసీ ఉద్యమాన్ని తాకట్టు పెట్టకుండా నిస్వార్ధంగా పనిచేయాలి..అలాంటి నేత ఉద్బవించినపుడు బీసీలంతా ఏకమై ఆ నాయకుడి వెంట నడుస్తారు..నిలబెడుతారు..ఒక బీసీ నేత ఒక కులానికి కాకుండా యావత్‌ బీసీలందరికి నాయకుడు కావాలి..

Latest News

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కులుస్తున్నారు

ఎంపీ ధర్మపురి అరవింద్ రైతు హామీల సాధన కోసం ధర్నా‎చౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసింది ముస్లింలను ఒకలా, హిందువులను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS