- కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ
- నాగా చైతన్య విడాకులకు కేటీఆరే కారణం
- హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా..?
- కేటీఆర్ తీరుతో కొంతమంది సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగా చైతన్య, సమంతా విడాకులకు కేటీఆర్ కారణం అని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని, మరికొందరు సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారని విమర్శించారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా అని ప్రశ్నించారు. ఎంతోమంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ అడుకున్నాడని సంచలన కామెంట్స్ చేశారు. ప్రతిదానికి ఎక్స్ లో స్పందించే కేటీఆర్, నా మీద ట్రోల్ చేసిన దానిపై ఎందుకు స్పందించలేదన్నారు.
మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కార్యకర్తలకు కేటీఆర్ చెప్పినట్లు ఉందని విమర్శించారు.అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు.ప్రభుత్వాలు తప్పు చేస్తే ఎత్తిచూపాలి కానీ వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించొద్దని సూచించారు.