తెలంగాణలో బతుకమ్మ పండగను ఆడబిడ్డలు
ఊర్లల్లో ఘనంగా జరుపుకుంటున్నారు..పితృ అమావాస్య నాడు ఎంగిలి పడని బతుకమ్మగా మొదలై.. తొలిరోజు బతుకులనిచ్చే బతుకమ్మ తల్లిగా,
తెల్లారి ఆయుష్షునిచ్చే బతుకమ్మగా.. మరుసటి రోజు ఆరోగ్యప్రదాయినిగా, నాల్గో రోజు సిరిసంపదలను ఒసగే తల్లిగా,ఐదో రోజు సంతాన వృద్ధిని ఇచ్చే బతుకమ్మగా, ఆరోవ రోజు అర్రెముగా, ఏడోవ రోజు పాడిపశువుల నొసగే తల్లిగా,
ఎనిమిదవ రోజు పసిడి పంటల నిచ్చే బతుకమ్మగా, తొమ్మిదో రోజు సకల సౌభాగ్యాలు, మాంగల్య బలమునిచ్చే బతుకమ్మ తల్లి అదే సద్దుల బతుకమ్మగా కూడా పిలుస్తారు.. ఆఖరి రోజున స్త్రీలు, చిన్నా, పెద్ద అంతా ఒక్కచోట చేరి పెద్ద బతుకమ్మను జేసి ఆడిపాడుతారు..
- శాంతి కృష్ణ వంగాల