ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ద మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ పై నిషేదం విధించింది. తమ దేశంలో ఆంటోనియా గుటేరస్ అడుగుపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ దేశంపై ఇరాన్ చేసిన దాడుల విషయంలో యూఎన్వో వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమ దేశం పై యూఎన్వో సెక్రెటరీ జనరల్ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. యూఎన్వో చరిత్రలో ఆంటోనియా గుటేరస్ ఒక మాయని మచ్చగా గుర్తుండిపోతారని ఆరోపించారు.