Friday, November 22, 2024
spot_img

పోలీసుల నిర్లక్ష్యం

Must Read
  • ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు
  • ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు
  • వికారాబాద్ టౌన్ ఇన్స్ పెక్టర్ సస్పెండ్
  • కొంత మందికి వీఆర్, మరికొంతమందిపై బదిలీ వేటు
  • ఇసుక అక్రమ రవాణాలో విఫలమయ్యారని చర్యలు
  • నెక్ట్స్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నజర్

రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఖాకీలపై చర్యలకు ఉపక్రమించారు ఉన్నతాధికారులు. మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన 3 సీఐలు, 13 మంది ఎస్సైలను వీఆర్ లో పెడుతూ మల్టీజోన్-2 ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే 1సీఐ, 14మంది ఎస్సైలను పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం వీఆర్ లో పెట్టిన వాళ్ళలో సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా, ఎస్సైలను వీఆర్ లో పెట్టారు. వీరిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉండటంతో వారిపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలో వీరిని లూప్ లైన్ కు బదిలీ చేశారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర ఎంక్వైరీల ద్వారా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అడవిదేవీపల్లి, వేములపల్లి, నార్కట్ పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట్, బొంరాస్ పేట్, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేశారు. ప్రధానంగా ఈ ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. అదేవిధంగా వాగులలో, నిషేధిత నది ప్రాంతాలలో ఎక్కడబడితే అక్కడ విచక్షణ రహితంగా ఇసుకను తవ్వితే పర్యావరణ సమతుల్యానికి భంగం వాటిల్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ ఈ విషయంలో సీరియస్ గా ఉండడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత అధికారులు భాధ్యత వహించాలి. కొండమల్లేపల్లి హోంగార్డు 947, జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ 1049 అక్రమ ఇసుక రవాణాలో వసూళ్లు చేయడం వల్ల వాళ్ళను సంబంధిత డీఏఆర్ కు అటాచ్ చేశారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పీడీఎస్ రైస్ అక్రమ రవాణా మీద ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటికే రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాలో స్థానికంగా చేసేవారు కాకుండా, ముఖ్యంగా అంతర్రాష్ట్రంగా చేసే ప్రధాన నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఐజీ ఆదేశించారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా, గ్యాంబ్లింగ్, మట్కా పూర్తిగా బంద్ కావాల్సిందే. గ్యాంబ్లింగ్, మట్కా జరిగితే సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే వికారాబాద్ లోని మర్పల్లిలో గెస్ట్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్న ప్రభాకర్ సేట్, రఫిక్ లను ఎస్పీ వికారాబాద్ తో పాటు ఐజీపీ మల్టీజోన్ -2 స్వయంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రఫీ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. పేద, మధ్య తరగతి వారి నుండి దోపిడి చేసే ఈ గ్యాంబ్లింగ్ పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మల్టీజోన్-2 లో గ్యాంబ్లింగ్ వాసనే రాకూడదు. జిల్లాల్లో ఎక్కడ కూడా గాంబ్లింగ్ జరగకుండా చూసే బాధ్యత 9 జిల్లాల ఎస్పీ లదే అని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.

ఇదీలా ఉండగా బాధ్యతాయుతమైన సర్కీల్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తూ ఒక మైనర్ బాలిక పై జరిగిన రేప్ కేసులో అలసత్వమూ, దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినందున ఎ.నాగరాజు, సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్, జోగిపేట ప్రస్తుతం స్టేషన్ హౌస్ ఆఫీసర్, వికారాబాద్ టౌన్ పీఎస్ గా పనిచేస్తున్న అధికారిని సత్యనారాయణ, ఐపీఎస్, మల్టీ జోన్-2 గారు విధుల నుండి సస్పెండ్ చేశారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS