Friday, November 22, 2024
spot_img

బల్దియాలో లాంగ్ స్టాండింగ్ గబ్బిలాలు

Must Read
  • ఏండ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్,ద్రుష్టి సారించని ప్రభుత్వం
  • అందినకాడికి దండుకునుటున్న అడిగే నాధుడు కరువు ..
  • ప్రతి అధికారికి ఓ బిగ్ షాట్ తో పొలిటికల్ కాంటాక్ట్ ..
  • ఖజానా ఖాళీ అయ్యి జీహెచ్ఎంసీ బాధలో ఉంటె అధికారులు, కార్పొరేటర్లు మాత్రం షికారు కొడుతున్నారు
  • ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో ఆలోచించడం మానేసి ఆఫీసర్లు,ప్రజాప్రతినిధులు లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు
  • ఎం చేసిన ప్రభుత్వం తమను వెనుకేసుకొస్తుందనే ధీమాతో రాష్ట్రాలను,దేశాలను చుట్టేసి సరదాలు తీర్చుకుంటున్నారు
  • బల్దియా గబ్బిలాల భరతం పట్టేదెప్పుడు..పట్టేదెవ్వరు ..

హైదరాబాద్ సిటీలో జీహెచ్ఎంసీలో ఉద్యోగం.. అంటే చిన్న విషయం కాదు ..ఇక్కడ అధికారులు పొందినంత స్వేచ్ఛ , దొరుకుతున్న రాచమర్యాదలు ,ప్రభుత్వాల అండదండలు మరే డిపార్టుమెంటులో దొరకదు.. అన్నింటికీ మించి మినిస్టర్ కు ఉన్నంత రాజభోగాలు ఇక్కడ ఉద్యోగులకుప్రజాప్రతినిధులకు దొరుకుతాయంటే నమ్యశక్యం కానీ నిజం.బల్దియా అంటేనే ఆఫీసర్లకు ఎంజాయిమెంట్ స్పాట్ గా మారిపోయింది..ఉద్యోగానికి వచ్చామా అంటే వచ్చాం..ఇంటికి పోయామా అంటే పోయాం..ఉద్యోగులకు అన్ని అలవెన్సులు వస్తున్నాయా అంటే వస్తున్నాయి . అన్నట్లుగా కొందరు అధికారులకు జీహెచ్ఎంసీ ఓ టూరిస్ట్ హబ్ గా మారిపోయింది..

పైసలు లేకపోతే పండుగ చేసుకోవడం కష్టం:-

నిజమే కదా…పైసలు లేకపోతే పండుగ చేసుకోవడమే కష్టం..మరి జల్సాలు చేస్తున్నవారిని ఏమనాలి..బల్దియా మాత్రం అందుకు భిన్నం. పైసలు లేక జీహెచ్ఎంసీ అవస్థలు పడుతుంటే..రేపటి సంగతి ఎల్లుండి చూసుకుందాం .. ఇప్పుడైతే ఎంజాయ్ చేయాల్సిందే అంటూ అధికారులు, కార్పొరేటర్లు ఇష్టం వచ్చినట్లు నిధులు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలున్నాయ్‌ బాబోయి అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా .. ఎవ్వరు పట్టించుకోవడంలేదు.. ..ఆర్థికపరమైన లోటును భర్తీ చేసుకునే మార్గమెట్లా అని ఆలోచించాల్సింది పోయి..అటు ఆఫీసర్లు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ లగ్జరీకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజలను టార్చర్ పెట్టి ట్యాక్స్‌ వసూలు చేసి..తీసుకున్న అప్పుల కోసం ప్రతి రోజు కోటిన్నర రూపాయల వడ్డీ కడుతున్నా.. అనుకున్నదే తడవుగా టూర్లు వేస్తున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో స్టడీ టూర్‌ అంటూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

బల్దియాలో లాంగ్ స్టాండింగ్ గబ్బిలాలు :-

అధికారులు నక్క తోక తొక్కి ఇక్కడకు వచ్చారా ..చాలు గబ్బిలం మాదిరిగా ఇక బల్దియాను పోము అని భీష్మించుకు కూర్చున్నారు .. ..ఇక్కడే ఉంటా అంటూ పైరవీలతో కాలం వెల్లదీస్తున్నారు.విచిత్రమేటంటే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి అధికారికి ఓ బిగ్ షాట్ తో పొలిటికల్ కాంటాక్ట్ .. ఉంటుంది..ఆ కాంట్రక్టును అడ్డం పెట్టుకుని లాంగ్ స్టాండింగ్ గబ్బిలాల మాదిరిగా తయారయ్యారు..బల్దియాకు వచ్చారంటే చాలు వెహికల్, కొత్త ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావాలని మంకు పట్టు పడుతున్నారట. ఇక లేటెస్ట్‌గా కార్పొరేటర్లు చేసిన స్టడీ టూర్ కోసం బల్దియా భారీగానే ఖర్చు చేసింది. ఒక్కో కార్పొరేటర్‌కు దాదాపు 69 వేల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా 115 మంది వరకు కార్పోరేటర్లు టూర్ కు వెళ్లారు.

అధికారులు, కార్పొరేటర్లు మాత్రం షికారు కొడుతున్నారు :-

జీహెచ్ఎంసీ లోని కార్పొరేటర్లు మూడు విభాగాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో టూర్ కు వెళ్లారు. మేయర్ డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో ఈ టూర్ జరిగింది.వీరిలో ఎంఐఎం కార్పొరేటర్లు స్పెషల్ వీరు ప్రత్యేకంగా టూర్ వెళ్లారు. మేయర్ బృందం యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. ఇక డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో సిక్కీంలో పర్యటించారు. అక్కడ అమలు అవుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులు, శానిటేషన్, రోడ్ల నిర్వహణ ఇతర అంశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ను స్టడీ చేసి ఇక్కడ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. గతంలో అధికారులు ప్రజాప్రతినిధులు వారి పర్యటనల్లో అధ్యయనం చేసిన వాటిని కార్పోరేషన్ పరిధిలో అమలు చేయించే వారు. కానీ ఇప్పుడు జరిగిన టూర్లతో వచ్చిందేంటో..స్టడీ చేసిందేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. జస్ట్ టైంపాస్ టూర్ అంటూ అలా వెళ్లి వచ్చిన వాళ్లే కామెంట్లు చేస్తుండటాన్ని చూస్తే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కార్పొరేటర్ల టూర్ తో జీహెచ్ఎంసీ కి ఏంటి లాభం ..:-

కార్పొరేటర్ల టూర్ తో జీహెచ్ఎంసీ కి ఎం ఉపయోగమంటూ బల్దియా కార్యాలయంలోని ఉద్యోగులే గుసగుసలు పెట్టుకుంటున్నారు.బల్దియా కష్టకాలంలో ఉన్నప్పటికీ దుబారా వ్యయం భారీగా పెరిగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పెడుతున్న ఖర్చు కూడా చాలా వరకు వేస్ట్ ఖర్చే అంటున్నారు పబ్లిక్. టూర్ల కథ అట్లుంచితే ఇక కొంతమంది అధికారులు అయితే తమ కార్యాలయాల రిన్నోవేషన్ కు భారీగా ఖర్చులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కిందిస్థాయి సిబ్బందికి, విజిటర్స్ కు మాత్రం కూర్చునేందుకు కుర్చీలు, టేబుల్స్ కూడా సరిగా లేని పరిస్థితి ఉంటె . ఉన్నతాధికారులకు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారట. గడిచిన మూడేళ్లలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కార్యాలయాల రిన్నోవేషన్, మెయింటేనెన్స్ కోసం ప్రభుత్వ ధనం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇక జోనల్ కార్యాలయాలు, డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల్లో ఎంత ఖర్చు అవుతుందో ఆ లెక్క వేరే.

బల్దియా పై కమిషనర్ అమ్రపాలి ప్రత్యేక ఫోకస్ :-

ఇక కొందరు అధికారుల అవినీతికైతే అంతే లేదన్న టాక్ ఎప్పటినుండో వినిపిస్తోంది… ఇటీవల జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో అవినీతి దుమారం రేగింది. దీనిపై కమిషనర్ అమ్రపాలి ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏకంగా సర్వీస్ నుంచే రిమూవ్ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.లిమిటెడ్ సర్కిల్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే అంత అవినీతి చేయగలిగినప్పుడు ..రెగ్యులర్ ఉద్యోగులు ఎంత చేయగలరో అర్ధం చేసుకోవచ్చు..ఇక ఇదే విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా తిష్టవేసిన అధికారులను సైతం రేపోమాపో శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇది తలాక్ నిజమా వేచి చోడాలి..అయితే ఈ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న ఓ ఉన్నతాధికారే కింగ్ పిన్ గా మారి ఎంటమాలజీ విభాగాన్ని భ్రష్టు పట్టించారని సిబ్బంది చెప్పుకుంటున్నారు..మొత్తానికి ఒక్కో విభాగంపై ఫోకస్ చేస్తూ కమిషనర్ అమ్రపాలి దూకుడు చూపుతుండటం.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు ఏ విభాగానికి ముంచుకొస్తుందో… ఎప్పుడు ఏ అధికారిపై వేటు పడుతుందోననే చర్చ జోరుగా సాగుతోంది. మరి దుబారా విషయంలో అమ్రపాలి తీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి..

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS