Friday, April 4, 2025
spot_img

రాణిగంజ్‌లో ఫుట్‌పాత్‌ పై అక్రమ నిర్మాణాలు

Must Read
  • నిత్యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
  • పట్టింపు లేని మున్సిపల్‌ అధికారులు

బేగంపేట్‌ సర్కిల్‌ రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని రాణిగంజ్‌లో ఫుట్‌ పాత్‌ పై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాత సిటీ లైట్‌ హోటల్‌ సమీపంలోని అశ్రు ఖానా వద్ద ఫుట్‌ పాత్‌ పై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయం కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం వాహనాలు, వ్యాపారులతో కిక్కిరిసి పోతుంది. నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని. ముందే ఇరుకైన రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఓవైపు వాహనాలు తిరగడానికి స్థలం ఉండదు… అలాంటిది, కొందరు అక్రమార్కులు ఫుట్‌ పాత్‌ ను సైతం కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నారు. ఫుట్‌ పాత్‌కు ఇరువైపులా డబ్బాలు పెట్టి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం చేస్తున్నారు.వీటిపై మున్సిపల్‌ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసిన బేగంపేట టౌన్‌ అధికారులు, సిబ్బంది పట్టింపు లేకుం డా నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS