Friday, November 15, 2024
spot_img

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో బ్రోకర్ల ఇష్టారాజ్యం..!!

Must Read
  • నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆఫీస్‌కి వెళ్తే చుక్కలు చూపిస్తున్న అధికారులు
  • పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బ్రోకర్‌ ఆఫీసులు
  • అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని అనుమానాలు
  • బ్రోకర్లు లేకుండా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లేందుకు జంకుతున్న జనం

సామాన్య ప్రజానీకం రిజిస్ట్రేషన్‌ కోసమని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని నేరుగా పరిగి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితే అక్కడి అధికారులు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ బ్రోకర్లను ఆశ్రయించేలా చేస్తు న్నారనే ఆరోపణలు ఆర్భాటంగా వినిపిస్తున్నాయి. అలా కాకుండా బ్రోకర్ల సహాయంతో వెళితే క్షణంలో వారి వారి పనులు అవుతు న్నాయని పలువురు వాపోతున్నారు.సామాన్య ప్రజలు ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్‌ కోసమని కార్యాలయానికి తీసుకెళ్తే అక్కడి అధికారులు ఫైల్‌ ఎవరు తయారు చేశారని మొహం పైనే అడుగుతున్నారు.డాక్యుమెంట్లు కరెక్ట్‌ ఉన్నాయా అని అడగగా నాకు తెలవదు అంటూ ! నాకు తెలవదు అంటూ! సామాన్య ప్రజలను అటు ఇటు తిప్పుతున్నారు. కనీసం డాక్యుమెంట్లు అన్న కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూడండి అని అడగగా మాకేమి తెలవదు అంటూ సామాన్య ప్రజలను ఇబ్బం దులకు గురి చేస్తు గంటల తరబడి నిల్చో బెడుతున్నారు. అంతే కాకుండా ఫైల్లో ఇది తప్పు ఉంది అది తప్పు ఉంది అని అటు ఇటు తిప్పుతున్నారు.అదే బ్రోకర్ల ద్వారా వెళితే వారికి రాకున్నా ఎలాంటి సమస్య ఉన్న క్షణంలో పూర్తి చేసి పంపించేస్తున్నారనే చెప్పవచ్చు. వికారాబాద్‌ జిల్లా,పరిగి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. గుడిలో దేవుడు దర్శనం ఇచ్చినట్లుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ముందు బ్రోకర్‌ అఫిసులు, బ్రోకర్లు దర్శనం ఇస్తూ ప్రజల జేబులు కాలి చేస్తున్నారని సామాన్య ప్రజలు విమర్శిస్తున్నారు.

అధికారులు ఉన్న ఏం ఉపయోగం :

జిల్లాలోని పరిగి కార్యాలయాలలో మధ్యవరులతోనే ఏవైనా పనులు ముందుకు సాగుతున్నాయి. గతంలో దరఖాస్తు పారం ఎలా పూర్తి చెయ్యాలో తెలియక మధ్యవర్తుల సహాయం కోరేవారు. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నప్పటికి కార్యా లయ సిబ్బంది కుంటి సాకులతో మధ్యవర్తులను ఆశ్రయించేలా చేస్తున్నారు.అదే ఆసరాగా చేసుకున్న మధ్యవర్తులు ప్రస్తుతం బ్రోకర్లుగా మారి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలోని అధికారులు, సిబ్బందితో కలిసిపోయి సామాన్య ప్రజల నుండి ఒక్కో పనికి ఒక్కో రేటు మట్లాడుకొని అందినకాడికి దండు కుంటు న్నారు. దీనితో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలో అధికారులు, సిబ్బంది వుం డి ఏం ప్రయోజనమని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు సైతం వాటా :

పరిగి కార్యాలయాల ముందు బ్రోకర్లు వారిని ఆకర్షించుకొని వారి పనికి ఇంత అని ఓ రేటు చెబుతున్నారు. బ్రోకర్లు తమకు వచ్చిన దరఖాస్తులు ఐదు నుండి పది వరకు ఒకేసారి తీసుకెళ్లి సరైన పత్రాలు లేకపోయినా అధికారులకు సర్దిచెప్పి వారి పనులను పూర్తి చేసుకొని అధికంగా డబ్బులు వసూలు చేస్తు న్నారు. ఇందులో ఈ రోజు ఏ ఏజెంట్‌ ఎన్ని పైల్స్‌ తీసుకు అన్నదానిపై అధికారులు ఏజెంట్ల వద్ద నుండి ఫైలుపై డబ్బులు అందుకుంటున్నారన్న విశ్వసనీయ సమాచారం లేకపోలేదు.

బ్రోకర్లు లేకుండా పని చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కష్టంగా ఉంది :

సామాన్య ప్రజలు నేరుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని తమ ఫైల్‌ ను తీసుకుని పరిగి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితే సాయం త్రమైనా పనులు కావడంలేదు. అదే ఏజెంట్లను సంప్రదించినట్లైతే ఏజెంట్ల సహాయంతో అధికారులు వేంబడే వారి పనులు తొం దరగా పూర్తి చేసి పంపిస్తున్నారు. దీనితో పేద ప్రజలు ఎజెంట్లను ఆశ్రయించడంతో ఒకటికి మూడిరతలు డబ్బు ఖర్చవుతుంది. బాండ్‌ పేపర్‌ పై అధిక పైసలు వసూల్‌…పరిగిలో బాండ్‌ పేపర్స్‌ విక్రేత షాపుల దగ్గర 50 రూపాయల బాండ్‌ తీసుకుంటే 20 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. అలాగే 100 రూపాయల బాండ్‌ కొంటే 140 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఏమాత్రం చలనం లేకుండా పట్టించుకోవడంలేదని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS