Friday, November 15, 2024
spot_img

చేవెళ్ళలో ఐరన్ అక్రమ వ్యాపారం

Must Read
  • దర్జాగా సీకు, సిమెంట్‌ విక్రయిస్తున్న వైనం
  • సైలెంట్‌ అయినా అధికారులు
  • గతంలో ఫిర్యాదులకు స్పందించని పోలీసులు
  • ఏళ్లుగా కొనసాగుతోన్న దందా

కొన్నేళ్లుగా సీకు, సిమెంట్‌ అక్రమంగా వ్యాపారం కొనసాగుతోంది. అటు, కంపె నీలకు, ఇటు ఏజెన్సీల నుంచి కస్టమర్లకు చేరాల్సీన సీకు, సిమెంట్‌ మధ్యలోనే వాటిని తీసుకువస్తున్న డ్రైవర్లకు ఐదు, పది చేతిలో పెట్టి లారీ నుంచి వారి స్థావారలలో దించి పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్ర వల్లి గేటు వద్ద ఉన్న ఓ దాబా వద్ద ఏళ్ల తరబడి అక్రమంగా సీకు, సిమెంట్‌ వ్యాపారం కొనసాగుతోంది. దీనికి సంబందిత అధికా రులకు కూడా ముడుపులు చెందుతున్నట్లు జోరుగా సమాచారం.

ధర్జాగా అమ్మకాలు.. దేవుని ఎర్రవల్లి గ్రామం వద్ద ఉన్న దాబా వద్ద కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని, కొన్నేళ్లుగా పట్టపగలే ధర్జాగా లారీ ట్రక్కులో నుంచి సీకు, సిమెంట్‌ కొంత దించుకుని తక్కువ ధరకే అమ్మకాలు చేస్తుంటారు. ముందుగా పరిచయం ఉన్న మేస్త్రీలకు, కాంట్రాక్టర్లకు కొంత డిస్కౌంట్‌ కూడా లబిస్తు న్నట్లు సమాచారం, ఆ ప్రాంతమంతా ఎప్పుడు గుంతలమయంగా బురదతోనే ఉంటుంది దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని లారీలు వస్తూ ఉంటాయో అని, దీనికి భూమి యజమాని కూడా కొంత సపోర్టు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సైలెంట్‌ అయినా అధికారులు.. గతంలోను ఇదే విషయంపై స్థాని కులు ఎస్‌ఓటీ సీఐకి ఫోన్‌ కాల్‌ ద్వారా ఫిర్యాదు చేస్తూ, ఆధా రాలు ఇచ్చినప్పటికి ఎలాంటి చర్యలు లేకపోవడం ఎస్‌ఓటీ సీఐ పనితీరుపై అనుమానాలకు తావిస్తుంది. అంతే కాకుండా సంబం దిత అధికారులకు ఈ సమస్యపై తెలియకుండా ఉండవచ్చా ? తెలిసినా వదిలేసి ఉండవచ్చా ? వారి మధ్య ఏదైన లావాదేవీల సంబందాలు ఉన్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు.

దాబా అందుకే.. అక్రమ వ్యాపారం కొనసాగించేందుకనే దాబా నిర్వహిస్తారన్నట్లు ఉంటుంది. ఆ దాబాలో గతంలోనూ గంజాయి అమ్మకాలు సాగినట్లు ప్రచారంలో కూడా ఉంది. సిమెంటు, సీకు అమ్మకాలకు, లారీ డ్రైవర్లకు సమాచారం ఇవ్వడంలోను కూడా ఈ దాబా యజమానిదే పని తీరు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పటికైన ఈ అక్రమ వ్యాపారం ఆగిపోతుందా, కొనసాగుతుందా వేచి చూడాలి.

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS