శ్రీ మాతాజీ యొక్క ఆధ్యాత్మిక రంగంలో చేసిన సేవలు అపూర్వమైనవని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో, ప్రపంచానికి ఆత్మ సాక్షాత్కారం అనుభవం ఇచ్చిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి జన్మ శతాబ్దికి స్మారక నాణెంను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ప్రత్యేక అతిధిగా అనిల్ శాస్త్రి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా నితిన్ గడ్కారీ మాట్లాడుతూ, శ్రీ మాతాజీ ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా సంపూర్ణ భారతీయ సాంస్కృతిని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేశారని అన్నారు.
అనంతరం మాజీ సీనియర్ అధికారి దినేష్ రాయ్ మాట్లాడుతూ, శ్రీ మాతాజీ నిర్మలా దేవి జన్మ శతాబ్ది స్మారక నాణెం చట్టపరమైనదని కానీ చలామణిలో లేని నాణెం అని వివరించారు. నాణెం ముందువైపు భారతదేశ జాతీయ చిహ్నం, దేవనాగరి లిపిలో “సత్యమేవ జయతే” “భారత్” అని ఉంటాయి, వెనుకవైపు పరమ పూజ్య శ్రీ మాతాజీ చిత్రంతో 1923, 2023 సంవత్సరాలు ముద్రించబడ్డాయని తెలిపారు. భారత ప్రభుత్వం ఈ పుణ్యకార్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు