Sunday, November 24, 2024
spot_img

కాలం పెట్టిన పరీక్షలకు ఎదురొడ్డి నిలిచిన యరగాని నాగన్న

Must Read

ఐ.ఎన్.టీ.యూ.సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ కు ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ తెలంగాణ సంస్ధ గౌరవ డాక్టరేట్‎ను ప్రకటించింది. 30 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ, వారి జీవితాల్లో వెలుగుల కోసం నిరంతరం పరితపిస్తున్నారు. స్ధానిక సమస్యలు మొదలుకొని, రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల హక్కుల కోసం గొంతెత్తారు. ఎటువంటి ఆస్తులు లేనప్పటికీ నిజాయితీ, ధైర్యంమే అతనికి సంక్రమించిన పెద్ద ఆస్తి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగారు.

రాజకీయ ప్రస్థానం:

యరగాని నాగన్నది సూర్యాపేట జిల్లాలో హుజూర్‎నగర్ సమీపంలోని మారుమూల ప్రాంతం బూరుగడ్డ. గ్రామంలోని రాజకీయ వాతావరణం అతడిని రాజకీయాల వైపు నడిపించింది. ప్రజలకు సేవ చేయాలనే తపన మొదలైంది. గ్రామంలో నిరంతరం ఏర్పడిన రాజకీయ సంఘర్షణల వల్ల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రారంభంలో వామపక్ష విద్యార్థి నాయకుడిగా అనంతరం విద్యార్థి దశలో ఎన్.ఎస్.యూ.ఐ నాయకుడిగా అనేక విద్యార్థి సమస్యలపై పోరాడారు. స్వర్గీయ నారపరాజు గోపి సహచర్యంలో పనిచేశారు. తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అనంతరం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేశారు. అ తర్వాతి కాలంలో అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కున్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా మొదలై కార్మిక సంఘం ఐ.ఎన్.టీ.యూ.సీతో అనుబంధం మొదలైంది. కార్మిక పక్షపాతిగా అనేక సమస్యల్ని పరిష్కరించడంలో పట్టు సాధించారు. ఎంపిటిసిగా, ఫోరం అద్యక్షుడిగా ఎన్నో పదవులు నిర్వహించారు. డాక్టర్ జి.సంజీవరెడ్డి నాయకత్వంలో పలు కార్మిక సమస్యలపై స్పందిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో కార్మిక నాయకుడిగా ఎదిగారు. 2007లో ఐ.ఎన్.టీ.యూ.సీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్యక్షులుగా ఎన్నికయ్యారు. అనేక పరిశ్రమలలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల కోసం తన గళాన్ని వినిపించి డిమాండ్లను సాధించడంతో సఫలీకృతం అయ్యారు. ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీలో జైపాల్ రెడ్డి, జానారెడ్డిలతో ఆత్మీయ అనుబంధం ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో హుజూర్ నగర్ మార్కెట్ చైర్మన్‎గా నియామకం అయ్యారు. గతంలో ముఖ్య మంత్రులుగా పనిచేసిన డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలతో సఖ్యతగా ఉండేవారు. ఏనాడు పదవులు కోరలేదు. ప్రభుత్వం ఇచ్చే అక్రమ జీవోలను నిరంతరం గమనిస్తూ లోటు, పాట్లను సరిదిద్దుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం క్రృషి చేశారు. రైతుల శ్రేయస్సు కోసం మార్కెట్ వ్యవస్థ ఉండాలని అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి ఉద్యమానికి కావాల్సిన అండదండలను అందించారు. వీరి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఐ.ఎన్.టీ.యూ.సీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. ఆనంతరం అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద కార్మిక వర్గాల గొంతును వినిపించారు. నిరంతరం పార్టీకి, కార్మిక సంఘాలను సమపాళ్లలో సమ ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. కరోనా సమయంలో అన్నార్తులకు, అభాగ్యులకు అండగా నిలబడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులకు అండగా నిలబడ్డారు. నియోజకవర్గంలో నాయకులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ధైర్యాన్ని నూరిపోశారు. 2022లో టీపీసీసీ క్యాంపియన్ కమిటీ చైర్మన్ మధుయాస్కి ఆశీస్సులతో రాష్ట్ర ఎక్జిక్యూటివ్ మెంబర్ కేసి వేణుగోపాల్ ద్వార నియామకం అయ్యి, 2023 ఎన్నికలలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి‌కె శివకుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హుజూర్ నగర్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అలాగే ఐ.ఎన్.టీ.యూ.సీని డాక్టర్ జీ.సంజీవరెడ్డి నేతృత్వంలో ప్రపంచస్థాయిలో ఎక్కువ మంది కార్మికులు సభ్యులుగా ఉన్న సంఘంగా గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. వేలాదిమంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు వివిధ కంపెనీలలో ప్రభుత్వ రంగ సంస్థలలో అగ్రిమెంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పటికీ కార్మికుల పక్షపాతిగా నిలుస్తున్నారు.

హుజూర్‎నగర్ నియోజకవర్గ సాధనలో ముఖ్య భూమిక :

2006-2007లో డీలిమిటేషన్‎లో భాగంగా హుజూర్‎నగర్ ను మరల నియోజకవర్గంగా సాధించడానికి హుజూర్ నగర్ నియోజకవర్గ సాధన కమిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉద్యమాన్ని నిర్వహించి నియోజకవర్గ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారు. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో మాత్రమే హుజూర్ నగర్ నియోజకవర్గంగా ఉండేది.

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, ఇందిరా భవన్ ఏర్పాటుకు క్రృషి :

1996 సంవత్సరంలో హుజూర్‎నగర్ పట్టణంలో కోట్లాది విలువ చేసే ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, సాముల శివారెడ్డిలను సమన్వయ పరిచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం పూర్తి చేయించి, మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయబాస్కర్ రెడ్డి , వైఎస్సార్ తో ప్రారంభం చేయించడంలో నాగన్న కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా ఐ.ఎన్.టీ.యూ.సీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ, నిజాయితీతో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, ఎల్లప్పుడూ వారికి ప్రజల ఆశీస్సులు ఉంటాయని అన్నారు. తన సేవలను మెచ్చి గౌరవ డాక్టరేట్ ప్రకటించడం వెనుక అనేక మంది తోడ్పాటు ఉందని అన్నారు.

Latest News

బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి, 11 మంది మృతి

లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు మిస్సైళ్ల‌తో దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 08...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS