Friday, November 15, 2024
spot_img

కూల్చేసి వదిలేశారు.. మళ్లోపారి కబ్జా చేశారు

Must Read
  • ప్రభుత్వ అధికారుల అలసత్వం
  • అక్రమార్కులకు అందివచ్చిన అవకాశం
  • రాజేంద్రనగర్ లో కొత్తగా కబ్జాల పర్వం
  • సర్వే నెం.156/1లో 3వేల గజాల సర్కారు భూమి కబ్జా
  • గతేడాది మే నెలలలో ఆదాబ్ లో కథనం
  • నిద్రలేచి అక్రమ కట్టడాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
  • ఇప్పుడు అదే జాగను మళ్లీ కొట్టేసిన అక్రమార్కులు
  • కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేదెవరూ.!
  • స్థానిక ఎమ్మెల్యే అనుచరులే కబ్జాచేసిన వైనం.?

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ గజం జాగ ఖాళీగా ఉన్న వదిలి పెట్టని పరిస్థితి. అక్రమార్కుల టకీమని అక్కడ వాలిపోతారు. అదీ చెరువు, కుంటలు, నాలా, ప్రభుత్వ భూమి, అసైన్డ్ ల్యాండ్, ప్రైవేటు వ్యక్తులది ఏదీ ఏమైనా సరే దానిపై కన్నుపడితే చాలు మింగేస్తారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ దందా చేసే కబ్జాకోరులు తమ ఆలోచనకు పదునుపెడతారు. ఈ క్రమంలో కూడా అక్రమార్కులు సర్కారు భూములను చెరబట్టడం చూస్తే వీళ్లకు మంచి, చెడు ఏంటో తెలియదని అనల్నా, లేక అధికార పార్టీ అండదండలు, అధికారుల ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారంటే రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది.

ఇక వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. గతంలో ఈ భూమిని కొందరు అక్రమార్కులు కొట్టేశారని తెలియడంతో మే 22, 2023వ తేదీన కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అనే శీర్షికతో ఆదాబ్ లో కథనం ప్రచురించడం జరిగింది. ఈ క్రమంలో నిద్రమత్తు వీడిన రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే నెంబర్ 156/1లో 3వేల గజాల గవర్నమెంట్ భూమిలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఆ తర్వాత దాన్ని వదిలేశారు. అయితే ఈ భూమిని 2017లోనే ఆక్రమించుకోని అప్పటి నుంచే కబ్జా ఉంటున్నారు. గత బీఆర్ఎస్ అండతో బెదిరించి, లంచాలతో అధికారులను మేనేజ్ చేశారు. అప్పట్లోనే స్థానిక ప్ర‌జ‌లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆదాబ్ కథనంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. గత బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు అందులో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ పార్టీతో అంటకాగుతున్న అక్రమార్కులను ప్రభుత్వ భూమిని మరోసారి కొట్టేసే పనిలో పడ్డారు. ఇటీవల మళ్లీ అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. చుట్టూ ప్రహారీ గోడలు కట్టి నిర్మాణాలు చేపడుతున్న రెవెన్యూ అధికారులు ఆ వైపు చూసిన పాపాన పోలేదు.

స్థానిక ఎమ్మెల్యే అనుచరులే కబ్జాకు పాల్పడి కట్టడాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆల్రెడీ ఆక్రమణకు గురైన భూమిలో కట్టడాలు కూల్చి స్వాధీనం చేసుకున్న సర్కారు భూమి జోలికి ఎవరూ అంత దైర్యంగా వెళ్తారని వాపోతున్నారు. అధికార పార్టీ అండతో కొందరూ గవర్నమెంట్ ల్యాండ్స్ ను చెరబడుతున్నారని వీరికి రెవెన్యూ, ప్రభుత్వ అధికారులు ఫుల్ సఫోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లక్షల్లో లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

రాజేంద్రనగర్ లో ఆక్రమణకు గురవుతున్న కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించి కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ పేరు చెబుతూ ల్యాండ్స్ కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారికి ఫుల్ సపోర్ట్ చేస్తూ, లంచాలు తీసుకొని కండ్లు మూసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు కాకుండా సర్వీసు నుంచి పూర్తిగా రిమూవల్ వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS