Thursday, November 14, 2024
spot_img

అనేక ప్రాంతాల్లో నాణ్యమైన అల్ట్రాసౌండ్ సేవలు కొరతగా ఉన్నాయి

Must Read
  • గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌, ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్

ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నాణ్యమైన అల్ట్రాసౌండ్ సేవలు కొరతగా ఉన్నాయని గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌, ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్ అన్నారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధునాతన గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌పై “అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ది అడ్నెక్సా అండ్ ఎండోమెట్రియం: ఆప్టిమైజింగ్ డయాగ్నోసిస్ ఇన్ ఎవ్రీడే ప్రాక్టీస్” అనే పేరుతో ప్రత్యేకంగా ఒక సింపోజియంను నిర్వహించింది. నగరంలోని హోటల్ మారిగోల్డ్‌ వేదికగా ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌లో ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్ పాల్గొని స్త్రీ జననేంద్రియ పరిస్థితుల నిర్ధారణ, సంబంధిత చికిత్సలో ఆధునిక అల్ట్రాసౌండ్ పద్ధతులు ఎలా మారుస్తున్నాయో అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సింపోజియంలో దేశవ్యాప్తంగా వచ్చిన 200 మంది ప్రాక్టీస్ గైనకాలజిస్ట్‌లు, రేడియాలజిస్ట్‌లు, పాథాలజిస్టులు, ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న వారు, గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌లో శిక్షణ పొందినవారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాలా సిబల్ మాట్లాడుతూ, “గైనకాలజీలో అల్ట్రాసౌండ్ అనేది గైనకాలజికల్ క్యాన్సర్‌లను గుర్తించే అద్భుతమైన రోగనిర్ధారణ పద్ధతి అని తెలిపారు.

అల్ట్రాసౌండ్ టెక్నాలజీలోని పురోగతి ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న లిటరేచర్ సరైన వైద్య నిర్వహణపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. అంతేకాకుండా ముందస్తు రోగనిర్ధారణ అనేది ప్రభావ వంతమైన సూచిక అయినప్పటికీ ఉన్నప్పటికీ, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నాణ్యమైన అల్ట్రాసౌండ్ సేవలు ఇప్పటికీ కొరతగా ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో దీని విస్తృత ఉపయోగం చాలా అవసరమని, ముఖ్యంగా అంకితభావంతో కూడిన బోధన, శిక్షణ, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ఇది నేటి సింపోజియం యొక్క ముఖ్య లక్ష్యాలనీ ” వివరించారు. అనంతరం ఫెర్నాండెజ్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ కామేశ్వరి ఎస్ మాట్లాడుతూ, “గైనకాలజీ, రేడియాలజీ, పాథాలజీ నిపుణులను ఒకచోట చేర్చడం ద్వారా, ఈ సింపోజియం క్యాన్సర్‌తో సహా తదితర ఆరోగ్య సంక్లిష్ట పరిస్థితులను నిర్ధారించడంలో అల్ట్రాసౌండ్‌ను ఎలా ఉపయోగించాలో అనే అంశాల గురించి సవివరంగా తెలియజేస్తుందని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుత వైద్య సాంకేతికతలో ముందంజలో ఉండటం ద్వారా రోగి సంరక్షణను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం” అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నగరంలోని ఆరోగ్య నిపుణుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించింది, ముఖ్యంగా మహిళల ఆరోగ్య సంరక్షణలో తాజా పురోగతుల నుంచి రోగులు ప్రయోజనం పొందేలా చూసింది.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS