- దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- నవంబర్ 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా
- వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్
దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయిన బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఖన్నా ఉన్నారు. ప్రస్తుత సీజేఐ డివై చంద్రచూడ్ స్థానంలో కొత్త న్యాయమూర్తి నవంబర్ బాధ్యతలు స్వీకరిస్తారు. అక్టోబర్ 18, 2024న డివై చంద్రచూడ్ సిఫార్సును అనుసరించి ఈ నియామకం జరిగింది. డివై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.