భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తూర్పు లద్దాఖ్ సెక్టర్లోని కీలక ప్రాంతాల నుండి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్ళినట్టు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతున్న ముగింపు పలికేందుకు భారత్- చైనా మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతంలోని టెంట్లను,తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నట్లు రెండు దేశాల బలగాలు వెల్లడించాయి.