Thursday, November 14, 2024
spot_img

పాకిస్థాన్‎లో ఉగ్రవాద శిక్షణ శిబిరం, కనిపెట్టిన భారత ఇంటిలిజెన్స్

Must Read

పాకిస్థాన్ ఆబోటాబాద్‎లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్‎ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే ఓ మెగా టెర్రర్ క్యాంప్‎ను ఏర్పాటు చేశాయని తెలిపింది. ఈ క్యాంప్ లోకి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు అడుగుపెట్టడం అంత సులభం కాదని వెల్లడించింది.

ఇక్కడ యువకులు,యువతులకు ఆయుధ వినియోగంతో పాటు ఇతర ఉగ్ర కార్యకాలపాల్లో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఆబోటాబాద్‎లోని ఓ సేఫ్ హౌస్‎లోనే అల్‎ఖైదా ఉగ్ర సంస్థ నాయకుడు బిన్ లాడెన్ దాకున్నాడు. 2011లో మే నెలలో అమెరికా కమాండోలు రహస్యంగా హెలికాప్టర్ లో ఇక్కడికి చేరుకొని లాడెన్‎ను చంపివేయడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది.

ఈ ప్రదేశంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS