Thursday, November 21, 2024
spot_img

పైసలు ఇచ్చుకోండి..నిర్మాణాలు చేసుకోండి

Must Read

ఉప్పల్‌ సర్కిల్‌లో యథేచ్ఛగా వెలుస్తున్న అక్రమ భవనాలు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో పెరిగిపోతున్న కట్టడాలు
  • పైసలకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్దంగా పర్మిషన్లు
  • మాముళ్ల మత్తులో జీహెచ్‌ఎంసీ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు
  • హబ్సిగూడ స్ట్రీట్‌ నెం. 8లో అనుమతులు లేకుండా
    పై అంతస్తుల నిర్మాణం
  • ప్రేక్షకపాత్రలో ఉప్పల్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం
  • అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానికల డిమాండ్‌

హైదరాబాద్‌ లో భూముల ధరలు, ఇండ్ల కొనుగోళ్లు, కిరాయిలు పెరిగిపోవ డంతో కొందరు అతి తెలివితో అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారు. మరోపక్క రాజధాని నగర పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం కామన్‌ అయిపోయింది. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు కనిపిస్తే చాలు గద్దల్లాగా అక్కడ వాలిపోయి వాటిని ఎగరేసుకొనిపోతున్నారు. ‘అయినోళ్లకి ఆకుల్లో, కానో ళ్ళకి కంచంలో’ అన్న చందంగా రాజకీయ, డబ్బు పలుకుబడితో అక్రమార్కులు తమ పని ఈజీగా చేసుకుంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో అయితే భూ ఆక్రమణలు, కబ్జాలు, అక్రమ నిర్మాణాల కు లెక్కే లేదు. పదేళ్లు గులాబీ లీడర్లు అందినకాడికి దోచుకు తిన్నారు. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కానవస్తుంది. కొందరు అధికార పార్టీలో చేరి అక్రమ దందాలు చేస్తుండగా మరికొందరు అవినీతి అధికారులతో ఉన్న పాత పరిచయాలను కంటిన్యూ చేస్తున్నారు. గవర్నమెంట్‌ ఆఫీసర్లు కూడా పైసలిచ్చినోడికి ఏదీ అంటే అదీ చేసి పెడతారు. ల్యాండ్ల రిజిస్ట్రేషన్లు కావొచ్చు, బిల్డింగ్‌ నిర్మాణాలకు పర్మిషన్లు కావొచ్చు లంచాలు తీసుకొని కళ్లు మూసుకొని సంతకం పెట్టి ఇచ్చేస్తారు.

హబ్సిగూడలో అక్రమంగా పై అంతస్తుల నిర్మాణం

ఇటీవల కాలంలో ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు యధేచ్చగా జరుగుతున్నాయి. జీహెచ్‌ ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బిల్డింగ్‌లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తీసుకుం టున్న అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. హబ్సిగూడలో అక్రమార్కులు అక్రమ కట్టడాలు కడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపెడుతున్నారు. ఇందులో భాగంగానే స్ట్రీట్‌ నెం. 8, వీరా రాజారెడ్డి మార్గ్‌లో అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి తీసుకున్న అనుమతులకు విరుద్దంగా ఓ నిర్మాణదారుడు బిల్డింగ్‌ పై అంతస్తుల నిర్మాణం చేపడుతున్నాడు. ఇంత జరు గుతున్న ప్రభుత్వ యంత్రాంగం ఆ వైపు కూడా తొంగి చూడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అనుమ తులకు విరుద్దంగా భవన నిర్మాణాలు చేపడుతున్నా ఉప్పల్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ప్రేక్షకపాత్ర వహిస్తుంది. ఉప్పల్‌ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై ఉప్పల్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అసిస్టెంట్‌ కమీషనర్‌ విజయ శ్రీ ని ఆదాబ్‌ ప్రతినిధి వివరణ కోరగా అనుమతులకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టినట్లయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి.. తదనంతరం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడిర చారు. అలాంటప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం చైన్‌మెన్స్‌ విధుల్లో నిర్లక్ష్యం వహించి నట్లే కదా.. 90శాతం పనులు పూర్తి కావొస్తున్న అక్రమ నిర్మాణాలు గుర్తించకపోవడం, వాటిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. మాముళ్ల మ త్తులో జోగుతూ అక్రమార్కులకు ఫుల్‌ సపోర్ట్‌ చేస్తూ, విధుల్లో నిర్లక్ష్యంవహించిన జీహెచ్‌ఎంసీ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను సస్పెండ్‌ చేయాలని కోరుతున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS