మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పై శనివారం రాత్రి ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులతో పాటు 14 మంది మహిళలను అదుపులోకి తీసుకొని డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది.
పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యంతో పాటు క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్ లభించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని రాజ్‌పాకాల పై ఎన్డీపిఎస్, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.