Thursday, November 21, 2024
spot_img

రాజకీయంగా ఎదుర్కోలేక శ్రీనివాస్ గౌడ్ పై కుట్రలు

Must Read
  • వికలాంగుల కాలనీను కులగొడితే బాధితులకు శ్రీనివాస్ గౌడ్ కుటుంబం అండగా నిలిచింది
  • శ్రీనివాస్ గౌడ్ కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు
  • కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
  • శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‎ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, పట్టణంలో వికలాంగుల కాలనీను కులగొడితే బాధితులకు శ్రీనివాస్ గౌడ్ కుటుంబం అండగా నిలిచిందని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగంని సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారని గుర్తు చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పోలీసులు సోషల్ మీడియా ప్రతినిధి వర్ధభాస్కర్ ని కొట్టడం సరికాదని, ప్రజా పాలనలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నదని, అందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని వ్యాఖ్యనించారు. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‎నగర్ ను అన్ని రంగాల్లో హైదరాబాద్ కి సమానంగా అభివృద్ది చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. ఎన్ని అక్రమ కేసులు కార్యకర్తలు, నాయకులు భయపడవద్దు, రాబోయేది భారాస ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

హన్వాడ మండల కేంద్రంలో 65 మందిపై కేసులు పెట్టేందుకు జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసిందని అన్నారు. కూలగొట్టిన వికలాంగుల, అందుల ఇండ్లను కట్టి ఇవ్వమని కోరాం..అది కూడా తప్ప అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయంలో అప్పనపల్లి బ్రిడ్జి నిర్మాణం రెండు ఏండ్లలో పూర్తి చేశామని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పెద్ద ఆస్పత్రి నిర్మించామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, పేదల పక్షాన అండగా నిలబడుతున్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు శివరాజ్, మల్లు నర్సింహా రెడ్డి, ఆంజనేయులు, దేవేందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, జంబులయ్య, రాఘవేందర్, నవకాంత్, అహ్మదుద్దిన్, ఇమ్రాన్, పాల సతీష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

అంతర్జాతీయ సినిమా వేడుకల్లో నాగ చైత్యన్య, శోభిత సందడి

గోవాలోని పనాజీ వేదికగా జరుగుతున్న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగలో టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగ చైత్యన్య, శోభిత సందడి చేశారు. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS