Thursday, November 14, 2024
spot_img

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు

Must Read

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు బీసీ సంఘాలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాయి.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి.కృష్ణమోహన్ రావు, బీసీ సంఘాలకు చెందిన ఇతర నేతలు జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ఆ ప్రక్రియలోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS