Thursday, November 14, 2024
spot_img

అవినీతి మత్తులో బడంగ్‌పేట్ మున్సిపాలిటీ

Must Read
  • మున్సిపల్ నిధులన్నీ సొంత జేబుల్లోకి మ‌ళ్లిస్తున్న పాలకవర్గం..
  • నాళాలు, గ్రీన్ బెల్టులు పార్కులు ఓపెన్ స్పేస్లు, అన్నీ స్వాహా
  • అవినీతి అక్రమాలపై వ్రాతపూర్వక ఫిర్యాదులకు స్పందన కరువు..!
  • అల్మాస్‌గూడ గ్రీన్ బెల్ట్ లో వేల‌ల్లో అక్రమ నిర్మాణాలు
  • టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయం
  • టీ.పి.ఓ లాలప్ప అధికార దుర్వినియోగం..!
  • ఐదు సంవత్సరాల్లో జ‌రిగిన జరిగిన అభివృద్ధి నాసిరకమే
  • బ‌డంగ్‌పేట్ బిజెపి అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి.

బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిజెపి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి, బిజెపి సీనియర్ నాయకులు చెరుకుపల్లి వెంకటరెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడంగ్పేట్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను పత్రికా ముఖంగా ఆధారాలను వ్యక్తిగరిస్తూ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపాలిటీ లైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు. వీటీ తర్వాత విస్తీర్ణంలో ఆదాయంలో అంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పోటీపడి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ బడంగ్పేట్ మున్సిపాలిటీ భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని, ప్రజల మౌలిక వసతులు, ప్రజల జీవన ప్రమాణం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అన్ని హంగులతో అభివృద్ధి జరగాలని భవిష్యత్తు పట్టణాన్ని ముందుగానే మాస్టర్ ప్లాన్ ఏర్పాటుచేసి ఉంచడం జరిగింది.

ఈ బడంగ్పేట్ మున్సిపాలిటీలో 120 ఫీట్ల రోడ్లు 100 ఫీట్ల రోడ్లు గ్రీన్ బెల్టులు, ఓపెన్ స్పేస్ స్థలాలు, పార్కులు ఇలా ఎన్నో అభివృద్ధి ప్రమాణాలను గత ప్రభుత్వాలు, ఏర్పాటు చేశాయి. ఈ విషయాన్ని హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, బడంగ్పేట్ మున్సిపాలిటీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వ అధికారులైన టిపిఓ మున్సిపల్ కమిషనర్ ఆర్.ఓ ఇలా అన్ని విభాగాలు స్పందించకపోవడం దున్నపోతు మీద వర్షం పడ్డట్లు వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

బడంగ్పేట్ మున్సిపాలిటీలో పాలకవర్గం ఉందా అసలు పాలకవర్గం ఏం చేస్తుంది. పాలకులు ప్రభుత్వ అధికారులు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకి చేరే పన్ను పూర్తిగా సొంత జేబుల్లోకి మరల్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడంగ్పేట్ మున్సిపాలిటీలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అవినీతికి పాల్పడుతుందని ఇక్కడ టౌన్ ప్లానింగ్ టిపీవో లాలప్ప అక్రమాలకు పాల్పడుతున్నాడని అక్రమ నిర్మాణాలపై నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడం మూడు రోజులే విధులు నిర్వహించడం ఆ మూడు రోజులు కూడా ఫోన్ చేసినా ఎత్తకపోవడం. ప్రభుత్వ అధికారుల అలసత్వం పాలకులు మేయర్ డిప్యూటీ మేయర్ ఏం చేస్తున్నారు. ఫుల్ టైం అధికారి ఎందుకు లేడు వ్రాతపూర్వక ఫిర్యాదులపై ఎందుకు స్పందించరు అని మండిపడ్డారు.. బడంగ్పేట్ నుండి ఆదిభట్ల వెళ్లే ప్రధాన రహదారి ఇతర ప్రధాన రహదారులు మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంటే మీరు చేసిన తీర్మానాలు ఒకటి , ఈ ప్రధాన రహదారి వెంట ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి , టౌన్ ప్లానింగ్ టిపివో లోపాయికారి ఒప్పందంతో ముడుపులకు అమ్ముడుపోయి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు.

అల్మాస్‌గూడ ప్రధాన రహదారి వెంట ఎఫ్డిఎల్లో భారీ పెట్రోల్ పంప్ గిడ్డంగుల నిర్మాణాలు వ్రాతపూర్వక ఫిర్యాదులపై నో యాక్షన్, అల్మాస్గూడ గ్రీన్ బెల్ట్ సర్వేనెంబర్ 122 ,123 ,124,129 వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు, ప్రవేట్ ఉద్యోగులతో మామూలు వసూలు చేసి లక్షల దండుకుంటున్న వైనం.. ప్రభుత్వ నిషేధిత స్థలంలో నాదర్గుల్ గ్రామం సర్వేనెంబర్ 743, 747, 748,749 750, దొంగ లేఔట్ లో వేసి అక్రమంగా యు.ఎల్.సి లో అనుమతులు ఇచ్చారు. ఇది మున్సిపల్ చట్టానికి పూర్తిగా విరుద్ధం. బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో పలు నాళాలు కబ్జాల గురై పూడ్చివేసిన పరిస్థితి ఎఫ్టి.ఎల్ బఫర్ జోన్లలో పూర్తిగా ఆక్రమణకు గురికావడం, వేసి రోడ్లు నాసిరకం ఇలా చెప్పకుండా పోతే కోట్లు ఖర్చుపెట్టి ఎస్.టి.పి ఏర్పాటు చేశారు ఆ ఎస్ టి పి ఏమైంది ఎక్కడ ఉంది? వాటి అభివృద్ధి పనులు ఏంటి.. ఇలా పూర్తి అవినీతి అక్రమాలకు పాల్పడడం దౌర్భాగ్యమైన పరిస్థితి, ఈ అవినీతి అక్రమాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి దృష్టి సారించి ఈ దొంగలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు సీనియర్ నాయకులు పలువురు పాల్గొన్నారు..

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS