Thursday, November 14, 2024
spot_img

గ్రీన్‌ బెల్ట్‌ను మింగేస్తున్న గద్దలు

Must Read
  • భవిష్యత్తులో జీవ వైవిధ్యానికి విఘాతం
  • బడంగ్‌ పేట్‌ మున్సిపాలిటీలో మితిమీరిన అవినీతి..
  • వక్రమార్గంలో అక్రమ అనుమతులు.. దృష్టిసారించని కలెక్టర్‌..
  • సల్మాన్‌ గూడా గ్రీన్‌ జోన్‌ ను కొల్లగొడుతున్న రాబందులు
  • పాత గ్రామ పంచాయతీ ఫోర్జరీ దస్తావేజులతో అనుమతులు
  • కొత్త మున్సిపాలిటీలో వేల నిర్మాణాలకు అసెస్మెంట్‌ లు, రిజిస్ట్రేషన్లు
  • ఒక గృహ నిర్మాణానికి సుమారు రూ.5 లక్షల లంచం..
  • వ్రాతపూర్వక ఫిర్యాదులను తొక్కి పెడుతున్న ప్రభుత్వ అధికారులు
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న
  • టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లాలప్ప, బడంగ్‌ పేట్‌ మున్సిపల్‌,
  • టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులు, ఎల్బీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌
  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గారు ఈ అవినీతిపై దృష్టి సారించాలి

హైదరాబాద్‌ మహానగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, హైదరాబాద్‌ మహానగరం తన పరిధిని విస్తరించుకుంటూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ దాటుకుంటూ వెళ్లడం గొప్ప విషయం. హైదరాబాద్‌ మహార నగరం చుట్టుప్రక్కల పలు గ్రామ పంచాయతీలను అభివృద్ధి కోసం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి, అభివృద్ధికి బాటలు వేస్తే, స్థానిక అధికారులు ఇదే అదనుగా తప్పుడు దోవలో లక్షల కోట్లు మూట కట్టుకుంటున్నారనడానికి ఈ వార్త కథనం నిదర్శనం.

హైదరాబాద్‌ మహానగరం ఓల్డ్‌ సిటీ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఇవన్నీ ఉండకుండా భవిష్యత్తులో ప్రజల అవసరాలను, జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నతస్థాయి అధికారులు, మేధావి వర్గం కఠినమైన ప్రభుత్వ నిబంధనలు ఏర్పాటుచేసి, భవిష్యత్‌ కార్యాచరణను దృష్టిలో ఉంచుకొని 100 ఫీట్ల విశాలమైన రోడ్లు, ఇండస్ట్రియల్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌ ఇలా వివిధ జోన్లుగా విభజించి అదే విధమైన ఇన్ఫాస్ట్రక్చర్‌ నిర్మాణాలు చేపట్టే విధంగా నిబంధనలు అయితే ఏర్పాటు చేసింది.

ఈ నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు ఏ విధంగా తప్పులు చేస్తున్నారో మీ ముందు ఉంచుతున్నాం.

అల్మాస్‌ గూడ గ్రీన్‌ బెల్ట్‌ సర్వే నంబర్‌ 122, 123, 129, 124అ, 124ఆ, 124ఇ, 50 ఎకరాల కంటే ఎక్కువ భూమి గత ప్రభుత్వం గ్రీన్‌ బెల్ట్‌ అంటూ భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తే, దీనికి పూర్తి విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతూ ఈ అక్రమ నిర్మాణంలో లక్షల్లో ముడుపు తీసుకొని మున్సిపల్‌ అధికారులు, సబ్‌ రిజిస్ట్రార్‌ వీరందరూ కూడా ఆమోదిస్తూ, విచ్చలవిడిగా మామూళ్ల మత్తులో జోగుతున్నారు.

ఈ గ్రీన్‌ బెల్ట్‌ లో వేల సంఖ్యలో గృహ నిర్మాణాలు, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. దీనికి పూర్తిగా వత్తాసు పలుకుతూ స్థానిక బడంగ్‌ పేట్‌ మున్సిపల్‌ అధికారులు అసెస్మెంట్‌ ద్వారా హౌస్‌ నెంబర్లు ఇవ్వడం, తద్వారా రిజిస్ట్రేషన్లు చేయడం, ఈ విధంగా తప్పుని ప్రోత్సహిస్తూ.. లక్షలు దండుకుంటున్నారు అవినీతి అధికారులు. ఈ అవినీతిపై ఎస్టిఎఫ్‌ ఇంచార్జ్‌, స్థానిక రంగారెడ్డి కలెక్టర్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గారు ప్రత్యేక దృష్టి సారించి తప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజానీకం డిమాండ్‌ చేస్తున్నారు. బడంగ్పేట్‌ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రేపటి కథనంలో.

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS