Thursday, November 14, 2024
spot_img

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవనం తలుపులు తెరిచేదెప్పుడో

Must Read
  • రూ. 12 కోట్లతో నూతన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవన నిర్మాణం
  • తొమ్మిది నెలలు కావస్తున్న తెరుచుకొని నూతన భవనం
  • రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారా ..?
  • ప్రజాప్రతినిధుల మద్య నెలకొన్న విబేధాలే కారణమని అంటున్న స్థానికులు
  • కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కావాల్సిందేనా..??

ప్రజల సొమ్ము వృధా చేయడం కొంతమంది ప్రజా ప్రతినిధులకు పరిపాటిగా మారింది. ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ ఈగోలతో తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తమను గెలిపించుకున్న పాపానికి ప్రజలకు అభివృద్ది చేయాల్సింది పోయి రాజకీయ కక్షలతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారు. తమకున్న పాత విబేధాలను మనసులో పెట్టుకుని అభివృద్దికి అడ్డుకట్ట వేస్తున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవన నిర్మాణం పనులు పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడానికి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అని స్థానికులు తెగేసి చెబుతున్నారు..

వివరాల్లోకి వెళ్తే,

నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలోనే సుమారుగా రూ. 12 కోట్లతో నూతన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవనం నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది . ఈ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్‎పూర్ గ్రామంలో 2.7 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. కానీ ఇక్కడి ప్రజా ప్రతినిధుల మధ్య నెలకొన్న విబేధాల కారణంగా ఈ భవనం నిర్మాణం పూర్తయి ఎనిమిది నెలలు గడుస్తున్నా “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్టు పట్టించుకునే నాధుడే లేక, ఇప్పటి వరకు నూతన భవనం తలుపులు తెరుచుకోలేదు.

ప్రజాప్రతినిధుల మద్య నెలకొన్న విబేధాలే కారణం :-

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప్రస్తుత మేయర్ లతా ప్రేమ్ గౌడ్, మాజీ మేయర్ మధ్య నెలకొన్న విభేదాలే మున్సిపల్ భవన నిర్మాణం ప్రారంభోత్సవానికి అడ్డంకిగా మారాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత మేయర్ లతా ప్రేమ్ గౌడ్, డిప్యూటీ మేయర్ పి.రాజేందర్ రెడ్డితో పాటు 16 మంది కార్పొరేటర్లు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాస తీర్మానం నెగ్గారు . మాజీ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టడం ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఏ మాత్రం ఇష్టం లేకపోవడంతో వీరి మద్య నెలకొన్న పంతం ఆ ప్రాంతానికి శాపంగా మారిందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. నూతన బిజెఎంసి కార్యాలయ పనులను ఎమ్మెల్యే జూన్ 20న పరిశీలించారు. ఈ సంధర్బంగా మేయర్ లతా ప్రేమ్ గౌడ్ ను పిలవకపోవడంతో ఈ వ్యవహారం మరింతగా ముదిరిందని చెప్పుకుంటున్నారు ..

పాత భవనంలో పుట్టెడు సమస్యలు :

ప్రస్తుతం ఉన్న మున్సిపల్ భవనం స్థానిక ప్రజలకు చాలా దూరంలో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళడానికి కనీస రవాణా సౌకర్యాలు లేవని వాపోతున్నారు. ఈ దారిలో కేవలం ఉదయం ఒక బస్సు, సాయింత్రం ఒక బస్సు మాత్రమే నడుస్తుండడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు మహిళా మేయర్, మహిళా కార్పొరేటర్లకు, సిబ్బందికి, కేవలం ఒకే ఒక్క టాయిలెట్ ఉండడంతో వారు కూడా తలలు పట్టుకుంటున్నారు.

ఈ టాయిలెట్ కు వెళ్లాలంటే కమిషనర్ గది నుండి వెళ్లాల్సి ఉంటుంది..దీంతో ప్రతిసారీ ఇలా కమిషనర్ గది నుండి వెళ్ళడం వారికి ఇబ్బందిగా మారుతుంది. ప్రజలు కనీసం తమ సమస్యలు చెప్పుకుందామని కార్యాలయానికి వెళ్తే కుర్చీలు కూడా లేని పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS