Thursday, November 14, 2024
spot_img

దివిస్‌ ల్యాబ్స్‌ ఓ పాపాల పుట్ట ..

Must Read

( దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌, మాజీ కలెక్టర్ అనితా రాంచంద్రన్‌ అవినీతి లెక్క తేల్చండి )

  • దివిస్‌ చైర్మన్‌ మేనల్లుడి 100 కోట్ల అవినీతి అక్రమాస్తులపై విచారణ జరిపించండి
  • దివిస్‌ ల్యాబ్స్‌కు అనుకూలంగా కమిటి నివేదికలో అనితారాంచంద్రన్‌ ఒత్తిడి..
  • గోల్డెన్‌ ఫారెస్ట్‌ భూమిలో దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ నిర్మాణాలు ఎందుకు ఆపలేదు.
  • అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయతికి 16 కోట్లు నష్టానికి కారకులెవ్వరు ?
  • యాదాద్రి జిల్లా మాజీ కలెక్టర్‌ అవినీతిపై లెక్కకు మించిన ఫిర్యాదులు
  • అనితారాంచంద్రన్‌ ను ఆగమేఘాల మీద ఎందుకు బదిలి చేసారు..
  • పర్యావరణ సామాజిక కార్యకర్త పి.ఎల్‌.ఎన్‌. రావు విచారణ సంస్థలకు ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనితారాంచంద్రన్‌ పై పలు వివాదాలు, అభియోగాలు చుట్టుముడుతున్నాయి. ఆమె పనిచేసిన కాలంలో దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌తో కుమ్మక్కై వంద ఎకరాల గోల్డెన్‌ ఫారెస్ట్‌ భూమిలో నిర్మాణాలు జరిగాయని, కాలుష్యంపై తప్పుడు నివేదికలను రూపొందించి, దివిస్‌ ల్యాబ్స్‌ కు అనుకూలంగా ఆమె వ్యవహరించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పర్యావరణ సామాజిక కార్యకర్త పి.ఎల్‌.ఎన్‌. రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశారు..విచారణ జరుపడమేకాదు అవినీతి అక్రమాలతో కూడా బెట్టిన ప్రజాదనాన్ని దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

దివిస్‌ చైర్మన్‌ మేనల్లుడి అక్రమ సంపాదన 100 కోట్లకు పైమాటే :-

యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడ్డాక మొదటి సారిగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనితారాంచంద్రన్‌ ఇదే జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం లింగోజిగూడెం పరిధిలో గల దివిస్‌ ల్యాబరేటరీస్‌ పరిశ్రమలో ఉత్పత్తులు కొనసాగిస్తున్నారు. పర్యావరణ నిబంధనలు ఇక్కడ అమలు చేయకపోవడంతో దివిస్‌ పరిసర గ్రామాలు కాలుష్య కారాలుగా మారి జన,మూగ జీవాలు జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి..

దివిస్‌ ల్యాబ్స్‌ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం:

యాదాద్రి జిల్లా మాజీ కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌ దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ తో కలిసి తమ పరిశ్రమకు దగ్గరలో ఉన్న భూమిలో పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు చేపట్టారు..ఈ నిర్మాణాలు చేపడుతున్న భూమి దివిస్‌ ల్యాబ్స్‌కు సంబంధించినది కాదని స్వయంగా రెవెన్యూ అధికారులు దృవీకరించారు.ఆ నిర్మాణాలు చట్టబద్దమైనవి కావని స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నా రైతులు ఫిర్యాదులు చేసిన సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగ నిర్మాణాలు పూర్తి కావడానికి స్థానిక మున్సిపల్‌ అధికారులపై జిల్లా పంచాయతి అధికారిపై ఒత్తిడి తెచ్చి అడ్డదారిలో నిర్మాణాలు పూర్తి అయ్యేలా సహకరించారు.

దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ 17 కోట్ల పన్నులు ఎగవేసిన మాజీ కలెక్టర్‌ చర్యలు తీసుకోలేదు

దివిస్‌ చైర్మన్‌ 2018లోనే నిర్మాణాలు పూర్తి చేసి 2021లో దరఖాస్తు చేసుకున్నారు . నిజానికి నిబంధనల ప్రకారం 17 కోట్ల రూపాయలు పన్నుల రూపంగా దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ చెల్లించాలి ..ఆలా చెల్లించే విధంగా చర్యలు చేపట్టి ప్రజా ధనాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్‌కు స్థానిక రైతులు ఫిర్యాదు చేశారు.ఈ అంశంపై అప్పటి మాజీ యాదాద్రి జిల్లా కలెక్టర్ కేవలం 80 లక్షలు చెల్లించే విధంగా వెసులుబాటు కల్పిస్తూ స్థానిక మున్సిపాలిటి గ్రామ పంచాయతి అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు 16 కోట్ల రూపాయలు నష్టపోవడానికి కారణమయ్యారు.

దివిస్‌ ల్యాబ్స్‌కు అనుకూలంగా నివేదిక రూపొందించి రైతులు ప్రయోజనాలు దెబ్బతీసారు

దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమ కాలుష్యంతో స్థానిక గ్రామాల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విసిగి వేసారిన ప్రజలు వందల సంఖ్యలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో నిరసన, ధర్నా చేపట్టారు. దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రటరి , అప్పటి యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అయిన అనితారాంచంద్రన్‌కి ఆదేశాలు జారీ చేశారు. ఒక కమిటి ఏర్పాటు చేసి దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమ పరిసర గ్రామాలకు సంబంధించి ఫిర్యాదు దారులను రైతులను సంప్రదించి పూర్తి స్థాయి నివేదిక పంపించాలని ఆదేశాలు జారి చేశారు..

అనితారాంచంద్రన్‌ ఒత్తిడితో ఆర్‌.డి.ఓ. సూరజ్‌ కుమార్‌ అక్రమంగా ఏకపక్షంగా నివేదిక తయారు :-

యాదాద్రి జిల్లా అప్పటి కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌ దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌తో కుమ్మక్కై చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా పనిచేసిన సూరజ్‌ కుమార్‌ అధ్యక్షతన ఓ కమిటిని ఏర్పాటు చేశారు .ఈ కమిటి దివిస్‌ ల్యాబ్స్‌ కాలుష్య ప్రభావిత గ్రామాలను సందర్శించకుండానే గ్రామస్తులకు ,ఫిర్యాదుదారులకు , రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండానే నీటి నమూనాలు మట్టి నమూనాలు సేకరించకుండానే ఏకపక్షంగా మాజీ కలెక్టర్ అనితారాంచంద్రన్‌ ఒత్తిడి మేరకు దివిస్‌ ల్యాబ్స్‌కు అనుకూలంగా నివేదిక రూపొందించి ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసారు.

డి.ఓ.పి.టి. న్యూఢల్లీికి ఫిర్యాదుతో బదిలి:

యాదాద్రి జిల్లా కలెక్టర్‌ గా అనితారాంచంద్రన్‌ విధులు నిర్వహిస్తున్న సమయంలో దివిస్‌ల్యాబ్స్‌ చైర్మన్‌కు అనుకూలంగా వ్యవహరించారని డి.ఓ.పి.టి. న్యూఢల్లీికి పలువురు స్థానికులు,రైతులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదులో వారు అనేక అంశాలను ప్రస్తావించారు. వందల ఎకరాల గోల్డెన్‌ ఫారెస్ట్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ..వందల కోట్లు దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌కు లబ్ది చేకూర్చడానికి అప్పటి మాజీ కలెక్టర్ అనేక నిబంధనలను అతిక్రమించారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు ..

దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ మేనల్లుడి ద్వారా అనితారాంచంద్రన్‌కు జరిగిన ఆర్థిక ప్రయోజనాలపై విచారించండి:

దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ మేనల్లుడు గత 15 సంవత్సరాలుగా సమకూర్చుకున్న అక్రమ ఆస్తులపై అక్రమ సంపాదనపై పూర్తి స్థాయిలో విచారిస్తే జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల అవినీతి బట్టబయలు అవుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌కు జిల్లా మాజీ కలెక్టర్ సహకరించడం వల్ల ప్రభుత్వానికి వెలకట్టలేని నష్టం జరిగిందని …జరిగిన నష్టాన్ని రికవరి చేసి అక్రమాలకు పాల్పడిన మాజీ కలెక్టర్ అనితారాంచంద్రన్‌ ,దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌తో పాటు దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ మేనల్లుడి అవినీతి అక్రమ సంపాదనపై లెక్కలు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు..ఈ మేరకు ప్రజా ప్రయోజనాలు ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరి చేయాలని పర్యావరణ సామాజిక కార్యకర్త పి.ఎల్‌.ఎన్‌. రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు ఫిర్యాదులు చేశారు.. యాదాద్రి జిల్లా మాజీ కలెక్టర్‌ అనితారంచంద్రన్‌ చౌటుప్పల్‌ ఆర్‌డిఓ సూరజ్‌ కుమార్‌ దివిస్‌ చైర్మన్‌ మేనల్లుడికి సంబంధించి 100 కోట్ల అక్రమ లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణ జరిపించి ప్రజాధనాన్ని రికవరి చేయాలని అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS