Thursday, November 14, 2024
spot_img

క్రీడలతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు లభిస్తుంది

Must Read
  • కల్వకుర్తి మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం,

క్రీడలతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ లభిస్తుందని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పేర్కొన్నారు. వచ్చే నెల మంచిర్యాల జిల్లాలోని శ్రీ ఉషోదయ ఉన్నత పాఠశాల స్టేడియంలో జరగబోయే 10వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కు సంబంధించి శనివారం జిల్లా ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికల కార్యక్రమానికి అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకుని క్రీడల్లో దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అండర్ -08,10,12, సం,,ల వయో విభాగాల్లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 250 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని, వీరిలో నుంచి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు 25మంది క్రీడాకారులను ఎంపిక చేసి, ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ తరపున ప్రశంస పత్రాలు అందజేయడం జరిగిందని జిల్లా ప్రధానకార్యదర్శి సోలాపోగుల స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షాహేద్, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ తాహెర్ అలీ, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎడ్మ శ్రీనుయాదవ్, జాయింట్ సెక్రటరీ పరశురామ్, స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల బాలునాయక్, పీడీ ప్రసాద్, సీనియర్ క్రీడాకారులు రాజు, రవి, పరశురాముడు, ముజ్జు,వెంకటేష్, రవీందర్ రెడ్డి, శేఖర్, ఫిజికల్ డైరెక్టర్స్ సుభాషిని, భాను, రాజేందర్, బాలస్వామి, శ్రీశైలం, చందు, మల్లేష్, నర్సిరెడ్డి, కుమారస్వామి, రమేష్, బాలయ్య, స్వేరోస్ నాయకులు భీమయ్య, ఎండి తురాబ్, పీఈటీలు రాజేందర్, శ్రీను, వినోద్ కుమార్, సైదులు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS