Thursday, November 14, 2024
spot_img

అన్నదాత సుఖీభవ

Must Read
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు
  • 2,94,427.25కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్లు
  • రెవెన్యూ లోటు 34,743.38 కోట్లుగా అంచనా
  • ద్రవ్యలోటు 68,742.65 కోట్ల రూపాయలు
  • వ్యవసాయం, విద్య, సంక్షేమ రంగాలకు పెద్దపీట
  • పాఠశాల విద్యకు రూ.29,909 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం కోసం రూ.18,497 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం – రూ.7,557 కోట్లు కేటాయింపు
  • గత ప్రభుత్వ విధానాలతో కుదేలయిన ఆర్థికరంగం
  • తొలిసారి బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2,94,427.25కోట్లతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన తొలి బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమాన్ని సమానంగా ప్రజలకు అందించేందుకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్‌.డి.పి.) లో రెవెన్యూ లోటు 4.19 శాతంగానూ ద్రవ్యలోటు 2.12 శాతంగానూ ఉండవచు అంచనా కట్టారు. పాఠశాల విద్య – రూ.29,909 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం రూ.18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమం – రూ.7,557 కోట్లు కేయించడం ద్వారా ఆయా రంగాలకు పెద్దపీట వేశారు. సవరించిన అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్ల రూపాయలు అయితే మూలధన వ్యయం 23,330 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొన్నారు. . 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 38,682 కోట్ల రూపాయలు కాగా, ద్రవ్యలోటు దాదాపు 62,720 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్‌.డి.పి.)లో వరుసగా 2.65 శాతంగానూ, 4.30 శాతంగానూ ఉన్నాయన్నారు.

ఆంధప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ చెప్పిన లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 43,488 కోట్లు ఉంటే..ద్రవ్యలోటు 52,509 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు వరుసగా 3.3 శాతంగానూ, 3.98 శాతంగానూ తెలిపారు. గత మేలో ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత ఓటాన్‌ అకౌంట్‌తో నడిపిస్తూ వచ్చారు. తాజాగా పూర్తిసథాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా ’తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1-12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. పాఠశాల విద్య – రూ.29,909 కోట్లు,వ్యవసాయం, అనుబంధ రంగాలు -రూ.11,855 కోట్లు, ఎస్సీ సంక్షేమం -రూ.18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమం -రూ.7,557 కోట్లు, బీసీ సంక్షేమం – రూ.39,007కోట్లు, మైనార్టీల సంక్షేమం – రూ.4,376 కోట్లు, మహిళా శిశు సంక్షేమం – రూ.4,285 కోట్లు, మానవ వనరుల అభివృద్ధి – రూ.1,215 కోట్లు, ఉన్నత విద్య – రూ.2,326 కోట్లు ఆరోగ్య రంగం – రూ.18,421 కోట్లు,పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి – రూ.16,739 కోట్లు, పట్టణాభివృద్ధి – రూ.11490 కోట్లు, గృహ నిర్మాణం – రూ.4,012 కోట్లు, జలవనరులు – రూ.16,705 కోట్లు,పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3,127 కోట్లు,ఇంధన రంగం – రూ.8,207 కోట్లు, రవాణా, రోడ్లు, భవనాలు – రూ.9,554 కోట్లు, యువజన, పర్యాటక, సాంస్కృతికం – రూ.322 కోట్లు, పోలీస్‌ శాఖ – రూ.8,495 కోట్లు. పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ – రూ.687 కోట్లు, పోలీసు శాఖ- రూ. 8,495 కోట్లు కేటాయించారు. ఇకపోతే లోపభూయిష్టమైన ఎక్సైజ్‌, ఇసుక విధానాలతో ఆదాయానికి గండిపడిరదని ఆర్థికమంత్రి వివరించారు. ప్రభుత్వ పన్నులు దారి మళ్ళించి 25 ఏళ్ల భవిష్యత్తు ఆదాయం తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్ళింపు వంటివన్నీ ఆర్థికరంగాన్ని కుదేలు చేశాయని అన్నారు. పిల్లల పౌష్టిక ఆహారం కోసం చిక్కి, వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపుల నిలుపుదల చేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల నిధుల మళ్ళింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందిన బిల్లుల బకాయిలు, ప్రాజెక్టుల నిధులు స్తంభింపజేయడంతో నీటిపారుదల రంగం కుదేలు కావడం,ఇంధన రంగ విధ్వంసం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఏర్పాటుతో కార్పొరేషన్ల నిధుల మళ్ళింపు వంటివన్నీ దెబ్బతీసాయని అన్నారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS