దేశ రాజధాని కాలుష్యంతో అల్లాడిపోతోంది, వాహనాల ద్వారా వచ్చే పొగ, చెత్తను కాల్చడం ద్వారా వచ్చే పొగ వలన, పరిశ్రమలు వదులుతున్న పొగ వలన వాతావరణంలో ఉండాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. నీళ్లు కలుషితం అవుతున్నాయి. ప్రజలు అనేక రోగాలబారిన పడుతున్నారు. చెట్లను నరకడం వలన వాతావరణంలో మరింత మార్పులు సంభవిస్తున్నాయి. కరువు కాటకాలతో మనిషి జీవితానికే అస్తిత్వం ఏర్పడేలా మారింది. రకరకాల పక్షుల జీవనం ప్రశ్ననార్థకంగా మారిపోతుంది. అరుదైన పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. తాగే నీళ్లు సైతం విషజలాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం, ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే దేశ భవితవ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ కాలుష్యం దేశ రాజధానికే పరిమితం కాకుండా దేశం మొత్తం కాలుష్యమయం అవుతుంది.
వాతావరణంలో కొనసాగుతున్న కాలుష్యాన్ని తగ్గించే ప్రణాళికలను ప్రభుత్వం తక్షణమే అమలు పరిస్తే కొంతవరకైనా గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ప్రజలు కూడ ఎవ్వరికి వాళ్ళు తమ సామజిక బాధ్యతగా తీసుకోని ప్రతి ఒక్కరు మొక్కను నాటి సంరక్షిస్తే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు సామజిక సృహతో అలోచించి చేరే ప్రతి విద్యార్థితో మొక్కను నాటించే విధంగా చేసి సంరక్షించే బాధ్యతను ఆ విద్యార్థిపైనే ఉంచగలిగితే మంచి నడవడిక నేర్పించడంతో పాటు బాధ్యతను గుర్తేరిగి క్రమశిక్షణకు అలవాటు పడుతారు. చిన్నారులు పెరిగే కొద్దీ వాళ్ళు నాటిన మొక్కలు పెరగడం వలన వారి జీవన విధానంలో, ఆలోచనలలో మంచి మార్పులు సంభవిస్తాయి.
దేశంలో ఉన్న లక్షలాది స్వచ్చంద సంస్థలు ప్రతి స్వచ్చంద సంస్థ ఎదో ఒక ఉరిని దత్తతీసుకొని స్థానిక అధికారులతో మమేకమై నిరంతరం మొక్కలు నాటిస్తూ సంరక్షణ చేసేలా చర్యలు తీసుకోగలితే వాతావరణంలో కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన గాలి వస్తుంది, వర్షాలు సక్రమంగా పడుతాయి. పక్షులకు జీవితాన్ని ప్రసాదించినట్టు అవుతుంది, అరుదైన పక్షి జాతులను కాపాడుకునట్టు అవుతుంది. చెట్ల పెంపకం వలన వర్షాలు సంవృద్ధిగా పడుతూ, మనిషి జీవనాదారం మెరుగు పడటమే కాకుండా స్వచ్ఛమైన గాలిని భవిష్యత్తు తరాలకు విలువైన సంపదగా అందించవచ్చు.
డాక్టర్. వై. సంజీవ కుమార్,
ఫౌండర్ & ప్రెసిడెంట్,
స్కై ఫౌండేషన్,
9393613555.