లగచర్ల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారాస పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లో అయినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల లో అధికారులపై జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అయినను అరెస్ట్ చేశారు. రైతుల తిరుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత సురేష్ తో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సురేష్ పరారీలో ఉన్నాడు. అయిన కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.