Thursday, November 14, 2024
spot_img

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్‎ను ఖండించిన కేటీఆర్

Must Read

భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్‎ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న భారాస నాయకులను అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకాలం నుండి భారాస పార్టీ ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్ట్‎లు ఎన్నో చూసిందని అన్నారు. పట్నం నరందర్ రెడ్డి అరెస్ట్‎ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఎంత అణిచి వేయాలని చూస్తే అంతకంటే ఎక్కువ పోరాటాలు చేస్తామని అన్నారు.తన అల్లుడి కంపెనీ కోసమే రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS