భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచదేశాలతో మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చని అభిప్రయపడ్డారు. అంతర్జాతీయంగా మోదీ పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంటుందని పేర్కొన్నారు. ప్రపంచదేశాలకు మధ్యవర్తిగా ఉండేందుకు భారత ప్రధానమంత్రి మోదీకి అర్హత ఉందని తెలిపారు.