- ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి కట్టడికి చర్యలు చేపట్టమని తెలిపారు. గంజాయిని సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని తెలిపారు. గత ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయి పట్టుకున్నమని అన్నారు.