Saturday, November 23, 2024
spot_img

పోలీస్ ఉద్యోగం..క్రమశిక్షణతో కూడుకున్నది

Must Read
  • తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌

పోలీస్‌ ఉద్యోగం అంటే క్రమ శిక్షణతో కూడుకున్నదని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ ఆర్‌.బి.వీ.ఆర్‌ ఆర్‌, శిక్షణ సెంటర్‌ లో ఏర్పాటు చేసిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, న్యాయం కోసం న్యాయమైన మార్గాలలో పని చేయాలని సూచించారు. విధుల్లో చేరిన ప్రతి ఉద్యోగికి సవాళ్లు ఎదురవుతాయని.. సవాళ్లను నీతి, నిజాయితీతో సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. పోలీస్‎శాఖ పేరు, ప్రఖ్యాతను పెంపోదించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు, ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి హృదయ పూర్యక అభినందనలు తెలిపారు. ఈ సంస్థ తన విధానాన్ని సమర్ధవంతగా అమలు చేస్తుండడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు.

వివిధ అంశంల్లో టాపర్‌గా నిలిచిన మహిళ అభ్యుర్థులకు డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. వీరిలో దాదాపుగా 1211 మంది మహిళ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇందులో చాలా మంది అభ్యర్థులు పీజి విద్యను అభ్యసించినవారు ఉండడం గమనర్హం. 50 శాతం మంది అభ్యర్థులు 21 నుంచి 25 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు. పరేడ్‌ కమాండర్‌గా ఉప్ప నూతల సౌమ్యా ఉన్నారు. ఇన్‌డోర్‌ అవుట్‌ డోర్‌ శిక్షణలో అత్యధిక మార్కులు సాధించిన రమాదేవి ట్రోఫి అందుకున్నారు. ఉత్తమ ఇన్‌డోర్‌ గా సోనియా నిలిచారు. యు.సౌమ్యా ట్రోఫి అందుకున్నారు. చెలాపూరా సెంటర్‌లో ఉత్తమ మహిళ కానిస్టేబుల్స్ గా జీ.దివ్వ, నిఖిళ తదితరులు ట్రోఫి అందుకున్నారు. బేగంపేట్‌ శిక్షణ సెంటర్‌లో కావాలి రావలిక అల్‌ రౌండర్‌గా నిలిచారు.

పీటీసీ రాజబహాదుర్‌ వెంకటరాం రెడ్డి శిక్షణ కేంద్రం నుండి కందుల మమత, చింతల రమాదేవి, సోనియా,పెద్దోళ్ల ప్రకృతి, ఎల్‌ భవాని, వీ.కృష్ణవేణి ట్రోఫిలు అందుకున్నారు. హైదరాబాద్‌ లోని చెలాపూరా శిక్షణ కేంద్రం నుండి జీ.దివ్వ, ఈ.శీరిషా, కే.నిహాళిక, కే.రాధిక, తదితర మహిళా కానిస్టేబుళ్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి ట్రోఫిలు అందుకున్నారు. బేగంపేట్‌ శిక్షణ కేంద్రం నుండి కావాలి రావాళీక, చిలకల రజీతా ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆవార్డలను సోంతం చేసుకున్నారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS