- ప్రధాని మోదీ
ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ అదృష్టంగా భావిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ధర్తీ అబా భగవాన్ బీర్సా ముండా 150 జయంతి సందర్బంగా బీహార్‌లోని జాముయ్‌లో ప్రధాని మోదీ అయినకు నివాలర్పించారు. అనంతరం అయిన పేరిట పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తమ ప్రభుత్వం ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి పదవిని ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము పేరు ప్రతిపాదించగానే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన విషయాన్ని ప్రధాని ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని అన్నారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించలేదని విమర్శించారు. ఆదివాసీ యువత క్రీడల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అదివాసీలకు చదువు, వైద్యం సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అదివాసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని అన్నారు. ఆదివాసీలు పండించే 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చామని వెల్లడించారు.