పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభంకానున్నాయి. నవంబర్ 25 నుండి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగానున్నాయి. సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
నిరుద్యోగం, రైతుల సమస్యలు, ఆదానీ గ్రూప్స్ పై లంచం ఆరోపణలు తదితర అంశాలపై వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది.