బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాడి కౌశిక్ తో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి,బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నవారిని గుర్తించి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు బుధవారం పాడికౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లారు. అయితే తాను వెళ్లకముందే ఏసీపీ వెళ్ళిపోవడం పట్ల కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇన్స్పెక్టర్ తో వాగ్వాదనికి దిగారు.